E-Paper
Advertisement

హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!

హోండా లవర్స్ కు క్రేజీ న్యూస్, CBR150R నయా బ్లాక్ ఎడిషన్ విడుదల!
Advertisement

2026 CBR150R Unveiled: దిగ్గజ మోటార్ సైకిల్ కంపెనీ హోండా.. మరో క్రేజీ బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. పాపులర్ స్పోర్ట్స్ బైక్ CBR150Rని కొత్త లుక్‌ తో పరిచయం చేసింది.  స్టెల్త్ బ్లాక్ తో ఈ బైక్ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఈ బైక్ ధర దాదాపు రూ. 3.13 లక్షలు ఉంటుందని కంపెనీ వెళ్లడించింది. మలేషియాలో హోండా అందించే చవకైన ఫుల్ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ గా CBR150Rకి మంచి గుర్తింపు ఉంది. ఇదే మోడల్ ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా లభిస్తోంది.

స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్ తో..

ఈ కొత్త మోడల్‌ లో పెద్ద ఛేంజ్ కలర్. ఇప్పటికే ఉన్న ట్రైకలర్, సిల్వర్ ఆప్షన్లతో పాటు ఇప్పుడు స్టెల్త్ బ్లాక్ రంగును జోడించారు. ఈ కొత్త కలర్ పూర్తిగా నలుపు బేస్‌ తో ఉండి, కొన్ని చోట్ల ఆరెంజ్ షేడ్స్‌ ను కలిపారు. ఫెయిరింగ్, ఫ్యూయల్ ట్యాంక్, ముందు భాగం, సీటు కింద ఉన్న ప్యానెల్స్‌ పై ఈ ఆరెంజ్ హైలైట్స్ బాగా కనిపిస్తాయి. బైక్ మరింత స్పోర్టీగా, అగ్రెసివ్‌ గా కనిపిస్తుంది. మ్యాట్ బ్లాక్ ఫినిష్‌ తో అల్లాయ్ వీల్స్, ఇంజిన్ కవర్, ఎగ్జాస్ట్ భాగాలు కూడా డార్క్ థీమ్‌ లోనే ఉంటాయి. మొత్తంగా ఈ కొత్త రంగు బైక్‌కు ఫ్రెష్ లుక్ ఇస్తుంది.

ఇంజిన్ లో నో ఛేంజెస్

Advertisement

డిజైన్‌ లో మార్పులు ఎలాంటి మార్పులు లేవు. CBR150R ఇంతకు ముందులాగే ఆకట్టుకునే స్పోర్ట్స్ బైక్‌ గానే ఉంటుంది. ఇంజన్ కూడా మారలేదు. 149.2 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ ఉపయోగించారు. ఇది సుమారు 16.3 PS పవర్, 13.7 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా అందిస్తున్నారు. ఈ సెటప్ వల్ల గేర్ మార్పులు సాఫీగా ఉండటంతో పాటు, రైడింగ్ మరింత కంఫర్ట్‌ గా ఉంటుంది.

హార్డ్‌ వేర్ పరంగా కూడా బైక్ బలంగా ఉంటుంది. డైమండ్ టైప్ ఫ్రేమ్‌ పై నిర్మించబడిన ఈ బైక్‌కు ముందు భాగంలో USD ఫోర్క్‌ లు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. 17 అంగుళాల వీల్స్‌ తో పాటు ట్యూబ్‌ లెస్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ABS అందుబాటులో ఉన్నాయి. ఇది భద్రతను మరింత పెంచుతుంది. టెక్నాలజీ విషయంలో, ఫుల్ LED లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

భారత్ లోకి ఎంట్రీ ఇస్తుందా?

Advertisement

భారతదేశంలో ఈ బైక్ ఒకప్పుడు లభించేది. కానీ, 2017 తర్వాత నిలిపివేశారు. తిరిగి రాబోతుందనే వార్తలు  వినిపించినా, ఇంకా అధికారిక సమాచారం లేదు. ఒకవేళ భారత మార్కెట్లోకి వస్తే, యమహా R15, కరిజ్మా XMR, పల్సర్ RS200 లాంటి బైక్‌లకు పోటీగా నిలుస్తుంది.

Read Also: LFP బ్యాటరీ vs NMC బ్యాటరీ.. ఏ బైక్ కు ఏ బ్యాటరీ బెస్ట్ అంటే?

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×