E-Paper
Advertisement

మార్కెట్ లోకి సరికొత్త హోండా సిటీ.. కొనలా? వద్దా?

మార్కెట్ లోకి సరికొత్త హోండా సిటీ.. కొనలా? వద్దా?
Advertisement

2026 Honda City Hybrid Review: భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్లలో హోండా సిటీ ఒకటి. చక్కటి సౌకర్యం, విశాలమైన క్యాబిన్, మంచి పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 2026 మోడల్‌ లో కొన్ని కొత్త ఫీచర్లతో పాటు కాస్త డిజైన్ మార్పులు కూడా వచ్చాయి. అయితే, ఈ కొత్త సిటీలో కొన్నిక్రేజీ ఫీచర్లు ఉన్నప్పటికీ, కొన్ని లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త హోండా సిటీ ప్లస్ పాయింట్స్

⦿ అద్భుతమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్

2026 హోండా సిటీలోని స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేస్తాయి. ఇవి 126 హెచ్‌పీ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హైబ్రిడ్ సిస్టమ్ EV, హైబ్రిడ్, ఇంజిన్ డ్రైవ్ మోడ్‌ మధ్య చాలా సున్నితంగా మారుతుంది. డ్రైవర్‌ కు పెద్దగా తేడా కూడా తెలియదు. ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్ చేసే సమయంలో ఎలక్ట్రిక్ మోటార్ సహకారంతో కారు వేగంగా స్పందిస్తుంది. ప్యూయెల్ ఎఫిషియెన్సీ కూడా ఈ కారుకు పెద్ద ప్లస్ పాయింట్. సుమారు 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

⦿ విశాలమైన క్యాబిన్

Advertisement

హోండా సిటీ ఎప్పటి నుంచో మంచి ఇంటీరియర్‌ ను కలిగి ఉంటుంది. కొత్త మోడల్‌ లో కూడా అదే ప్రత్యేకత కొనసాగింది. ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు వెంటిలేషన్ ఫీచర్‌ ను కూడా యాడ్ చేశారు. వెనుక సీట్లో ప్రయాణించే వారికి మంచి లెగ్‌ రూమ్, వెనుక ఏసీ వెంట్స్, టైప్ సీ ఛార్జింగ్ పోర్టులు, సన్‌ షేడ్ లాంటి సౌకర్యాలు లభిస్తాయి. కొత్త ఐవరీ-బ్లాక్ ఇంటీరియర్ థీమ్ క్యాబిన్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఎక్కువసేపు ప్రయాణించే వారికి ఈ కారు మంచి కంఫర్ట్‌ ను అందిస్తుంది.

కొత్త హోండా సిటీ మైనస్ పాయింట్స్

⦿ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్  

హోండా కొత్తగా 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరాను అందించింది. కానీ, ఈ రెండు ఫీచర్లు పోటీ కార్లతో పోలిస్తే అంతగా ఆకట్టుకోవడం లేదు. ఎక్కువ సూర్యకాంతిలో టచ్‌ స్క్రీన్‌ ను స్పష్టంగా చూడటం కొంత కష్టంగా ఉంటుంది. యూజర్ ఇంటర్‌ ఫేస్ కూడా ఆధునికంగా అనిపించదు. 360 డిగ్రీ కెమెరా ఫీడ్ నాణ్యత కూడా ఆశించినంత మెరుగ్గా లేదు.

⦿ హైబ్రిడ్ వేరియంట్ ధర  

Advertisement

2026 హోండా సిటీ హైబ్రిడ్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.21 లక్షల వరకు ఉంది. గత మోడల్‌తో పోలిస్తే దాదాపు రూ.1 లక్ష ఎక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. కొన్ని కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, పెద్ద మెకానికల్ మార్పులు లేకపోవడంతో ఈ ధర పెరుగుదల కొంతమంది ఎక్కువగా భావిస్తున్నారు. ముఖ్యంగా టచ్‌ స్క్రీన్, కెమెరా లాంటి ఫీచర్లు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ధరకు తగిన విలువ లభిస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: 2026 టాటా టియాగో Vs హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్.. వీటిలో ఏది బెస్ట్ హ్యాచ్‌ బ్యాక్?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×