E-Paper
Advertisement

Honda Monkey 125: సరికొత్త హోండా మంకీ 125 వచ్చేసింది, స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Honda Monkey 125:  సరికొత్త హోండా మంకీ 125 వచ్చేసింది, స్పెషాలిటీ ఏంటో తెలుసా?

హోండా కంపెనీ తన పాపులర్ మోడల్ మంకీ 125ని సరికొత్తగా ఆవిష్కరించింది. ప్రపంచ మార్కెట్ల కోసం 2026 మోడల్ ను లాంచ్ చేసింది. ఇంజిన్ లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొత్త కలర్ స్క్రీమ్స్ తో తీసుకొచ్చారు.  కలర్ ఆప్షన్స్ మినహా అదే ఇంజిన్, ఛాసిస్, ఫీచర్లతో ముందుకు వచ్చింది. 2026 వెర్షన్ యూరో 5+ పొల్యూషన్ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి రానుంది.

హోండా మంకీ గురించి..

హోండా మంకీ అనేది 1961 నాటి నుంచి కొనసాగుతున్న పేరు. ఫస్ట్ టోక్యోలోని టామా టెక్ కు సంబంధించి ఒక చిన్న 49cc మోటార్‌ సైకిల్‌ ను డెవలప్ చేయబడింది. 1960 ప్రారంభంలో రోడ్ లీగల్ వెర్షన్ ను అనుసరించి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడింది. దశాబ్దాలుగా మంకీ..  పెద్ద వీల్స్, అప్ డేట్ చేసిన స్టైలింగ్,  ఎప్పటికప్పడు సరికొత్తగా డెవలప్ అవుతూ వస్తోంది. 1970ల చివరి నాటికి, ఇది టియర్‌ డ్రాప్ స్టైల్ ఫ్యూయెల్ ట్యాంక్ ను తీసుకొచ్చింది. కాంపాక్ట్ ట్రావెల్ ఆప్షన్ గా మంచి ప్రజాదరణ పొందింది. 2018లో  హోండా మంకీని అసలు డిజైన్ ఆధారంగా ఆధునిక 125cc మోటార్‌ సైకిల్‌గా తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్, తక్కువ పొల్యూషన్ వెలువడేలా అప్ డేట్ చేయబడింది.

హోండా మంకీ 125 ఇంజిన్, పనితీరు

మంకీ 125  బైక్.. 124cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 6,750 rpm దగ్గర 9.2bhp,  5,500rpm దగ్గర 10.7Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు స్పీడ్ గేర్‌ బాక్స్‌ తో వస్తుంది. యూరో 5+  పొల్యూషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇంజిన్ ECU సెట్టింగ్‌లు, అప్ డేట్ చేసిన కన్వర్టర్, అదనపు OBD2-2 సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 91 కి.మీగా ఉంటుంది.

హోండా మంకీ 125 ఛాసిస్, సస్పెన్షన్, బ్రేక్‌లు

మంకీ 125  బైక్ స్టీల్ బ్యాక్‌ బోన్ ఫ్రేమ్ చుట్టూ బిల్డ్ చేయబడింది. సస్పెన్షన్ కోసం  ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. సీటు ఎత్తు 776mmగా ఉంటుంది. కెర్బ్ బరువు 105 కిలోలు. ఈ బైక్ ఫ్రంట్, రియర్ లో డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. ABS ప్రామాణికంగా ఉంటుంది. బ్రేకింగ్ సమయంలో వెనుక వీల్స్ లిఫ్ట్‌ ను నియంత్రించడానికి ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ ను కలిగి ఉంటుంది.

మంకీ 125  బైక్  ఫీచర్లు  

మంకీ 125 పూర్తి LED లైటింగ్, రౌండ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో అమర్చబడి ఉంటుంది. స్పీడ్, ఓడోమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్లు, ఫ్యూయెల్ లెవల్ ను చూపుతుంది. 5.6 లీటర్ల ప్యూయెల్ ట్యాంక్ ను కలిగి ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో  మోటార్‌ సైకిల్‌ను గుర్తించడంలో ఉపయోగించడానికి ఆన్సర్ బ్యాక్ ఫంక్షన్‌ తో కూడిన కీ  ఫీచర్లను కలిగి ఉంటుంది. హోండా వెనుక క్యారియర్, సైడ్ బ్యాగ్ సపోర్ట్, USB ఛార్జింగ్ సాకెట్, హీటెడ్ గ్రిప్స్, ఇమ్మొబిలైజర్ అలారం, గేర్ ఇండికేటర్ డిస్ ప్లే లాంటి  యాక్సెసరీస్ ను కూడా అందిస్తుంది.

2026 మంకీ 125 కలర్ స్కీమ్స్   

2026 మంకీ 125 మోడల్ కొత్త కలర్స్ స్కీమ్స్ తో వస్తుంది.  మ్యాట్ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్, మిలీనియం రెడ్‌తో నైట్ సిల్వర్ మెటాలిక్, బనానా యెల్లో పెర్ల్ హిమాలయాస్ వైట్ కలర్స్ లో వస్తుంది.

Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×