E-Paper
Advertisement

హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌ లో BYD ఎంట్రీ.. ఏకంగా 1200 కి.మీ రేంజ్ కారు రెడీ!

హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌ లో BYD ఎంట్రీ.. ఏకంగా 1200 కి.మీ రేంజ్ కారు రెడీ!
Advertisement

BYD Seal U India Launch: గత కొద్ది సంవత్సరాలుగా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెట్టిన చైనా ఆటో దిగ్గజం BYD ఇప్పుడు భారత మార్కెట్ కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ తొలిసారిగా సొంత ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ కొత్త DM-i సూపర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ తో వచ్చే తొలి మోడల్ BYD సీల్ యు SUV. ఈ కారు 2026 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు కేవలం ఈవీల అమ్మకం

ఇప్పటి వరకు BYD భారత్‌ లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అమ్ముతోంది. కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో కంపెనీ మరింత కస్టమర్ బేస్‌ పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా EVలపై ఆసక్తి ఉన్నప్పటికీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై ఆందోళన ఉన్న వినియోగదారులను ఈ మోడల్ మరింతగా ఆకట్టుకోనుంది.

1200 కి.మీ రేంజ్

Advertisement

BYD అభివృద్ధి చేసిన DM-i హైబ్రిడ్ సిస్టమ్‌ లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ వ్యవస్థలో ప్రధానంగా కారు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారానే నడుస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే పెట్రోల్ ఇంజిన్ పని చేసి బ్యాటరీకి శక్తిని అందిస్తుంది. లేదంటే అదనపు పవర్‌ ను అందిస్తుంది. ఈ పవర్‌ ట్రెయిన్ ఒకసారి పూర్తి ట్యాంక్ పెట్రోల్, పూర్తి బ్యాటరీ ఛార్జ్‌ తో కలిపి 1,200 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ ను అందిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటే, కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు పెట్రోల్ అవసరం లేకుండానే ఉపయోగపడే అవకాశం ఉంది.

ప్రత్యేకంగా మోడ్ మార్చాల్సిన అవసరం లేదు!

ఈ సిస్టమ్ ప్రత్యేకత ఏమిటంటే, డ్రైవర్ ప్రత్యేకంగా మోడ్ మార్చాల్సిన అవసరం ఉండదు. కారు ఆటోమేటిక్ గా EV మోడ్, హైబ్రిడ్ మోడ్, పెట్రోల్ మోడ్‌ మధ్య మారుతూ ఉంటుంది. డ్రైవింగ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.  భారత్‌కు రానున్న సీల్ యు SUV పరిమాణం పరంగా మధ్యతరహా ప్రీమియం SUV విభాగంలో ఉంటుంది. ఐదుగురు ప్రయాణికులకు సౌకర్యవంతమైన క్యాబిన్‌ ను అందిస్తుంది.

ఆకట్టుకునే డిజైన్ తో..

Advertisement

డిజైన్ పరంగా సీల్ యు, ఇప్పటికే దేశంలో అమ్మకాల్లో ఉన్న BYD సీలియన్ 7 EVలా ఉంటుంది. అయితే, ముందు భాగంలో సాంప్రదాయ గ్రిల్ ఉండటం దీని ప్రత్యేకత. లోపల ప్రీమియం ఇంటీరియర్, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ADAS భద్రతా ఫీచర్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి.

ధర ఎంత అంటే?

BYD సీల్ యు భారత మార్కెట్లో సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధరలో విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ విభాగంలో రాబోయే ఇతర ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUVలతో ఇది పోటీ పడనుంది.

Read Also: ఫాస్ట్ ఛార్జింగ్ vs స్లో ఛార్జింగ్.. EV బ్యాటరీకి ఏది బెస్ట్?

Related News

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×