E-Paper
Advertisement

ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు.. కొత్త టెక్నాలజీతో రాబోయే 4 అద్భుతమైన కార్లు!

ప్రీమియం నుంచి బడ్జెట్ వరకు.. కొత్త టెక్నాలజీతో రాబోయే 4 అద్భుతమైన కార్లు!
Advertisement

4 Upcoming Cars 2026: భారతీయ కార్ల మార్కెట్ రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ఒకప్పుడు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఉన్న కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కొనుగోలుదారులు కొత్త టెక్నాలజీ, మంచి ఫీచర్లు, సౌకర్యం ఉన్న కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందుకే కంపెనీలు కూడా కొత్త రకమైన మోడళ్లను తీసుకురావడానికి రెడీ అవుతున్నాయి. త్వరలో మార్కెట్‌లోకి రానున్న కొన్ని ఆసక్తికరమైన కార్ల గురించి చూద్దాం.

⦿ JSW Jetour T2

జేఎస్‌డబ్ల్యూ జెటూర్ టి2 2026లో విడుదల అయ్యే అవకాశం ఉన్న ప్రీమియం SUV. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానుంది. అంటే, ఇంధనంతో పాటు ఎలక్ట్రిక్ పవర్ కూడా ఉపయోగించుకుంటుంది. ఈ SUV స్టైలిష్ డిజైన్, పెద్ద సైజ్, మంచి కంఫర్ట్‌ తో ఆకట్టుకుంటుంది. ధర కూడా సుమారు రూ. 45 నుంచి 50 లక్షల మధ్య ఉండొచ్చు. కొత్త టెక్నాలజీతో కూడిన SUV కోసం చూస్తున్న వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.

⦿ Honda Prelude

Advertisement

ఇంకో ఆసక్తికరమైన కారు హోండా ప్రిల్యూడ్. హోండా చాలా కాలం తర్వాత భారత మార్కెట్‌ లోకి స్పోర్ట్స్ కారు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇది 2 డోర్ స్పోర్ట్స్ కారు. డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి బాగా నచ్చుతుంది.  చాలా పవర్‌ ఫుల్ కాకపోయినా, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తుంది. ముఖ్యంగా హైబ్రిడ్ ఇంజన్‌తో రావడం వల్ల పనితీరు, మైలేజ్ మధ్య మంచి సమతుల్యం ఉంటుంది. ఈ కారు 2026లో విడుదల అయ్యే అవకాశముంది.

⦿ టాటా MPV

టాటా మోటార్స్ తొలిసారిగా ఒక పూర్తి స్థాయి MPVను తీసుకురావాలని చూస్తోంది. ఇది 7 సీట్లతో ఉండే ఫ్యామిలీ కారు. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు హైబ్రిడ్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ధర రూ. 15 నుండి 25 లక్షల మధ్య ఉండవచ్చు. పెద్ద కుటుంబాలకు, ఎక్కువ స్థలం కావాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా మారొచ్చు. ఈ కారు 2027 నాటికి మార్కెట్‌ లోకి రావచ్చు.

⦿ VinFast VF3

Advertisement

ఇది చిన్నగా ఉండే స్టైలిష్ SUV. ధర తక్కువగా ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. సుమారు రూ. 5 నుంచి 9 లక్షల మధ్య ధర ఉండొచ్చని అంచనా. ఈ కారు చిన్న సిటీ డ్రైవింగ్ కు బాగా సరిపోతుంది. జిమ్నీ లాంటి లుక్‌ తో ఉండటం వల్ల యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. 2027 ప్రారంభంలో ఈ కారు భారత్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

త్వరలో భారత మార్కెట్‌ లోకి రానున్న ఈ కార్లు వినియోగదారులకు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించబోతున్నాయి. టెక్నాలజీ, డిజైన్, సౌకర్యం అన్నీ కలిపి ఇప్పుడు కార్లు మరింత ఆధునికంగా మారుతున్నాయి. కొత్త కారు కొనాలని అనుకునేవారికి ఇవి మంచి ఆప్షప్స్ గా మారే అవకాశముంది.

Read Also: టయోటా షాక్.. ఫార్చ్యూనర్, హైరైడర్ సహా పలు కార్ల ధరలు పెంపు!

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×