E-Paper
Advertisement

Best Motorcycle Helmets: స్టీల్‌బర్డ్ ఇగ్నైట్ To కోర్డా ఐకాన్.. ఇండియాలో బెస్ట్ హెల్మెట్స్ ఇవే!

Best Motorcycle Helmets: స్టీల్‌బర్డ్ ఇగ్నైట్ To కోర్డా ఐకాన్.. ఇండియాలో బెస్ట్ హెల్మెట్స్ ఇవే!
Advertisement

Best Motorcycle Helmets 2026: చాలా మంది తమకు ఇష్టమైన బైకులు కొనుగోలు చేస్తారు. హెల్మెట్ విషయంలో అంతగా జాగ్రత్తలు తీసుకోరు. ఫలితంగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, సరైన హెల్మెట్‌ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న బెస్ట్ హెల్మెట్స్, వాటి ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ స్టీల్‌బర్డ్ ఇగ్నైట్ IGN-7

దేశంలో అందుబాటులో ఉన్న బెస్ట్ హెల్మెట్స్ లో స్టీల్‌ బర్డ్ ఇగ్నైట్ IGN-7 ఒకటి. ఇది మూడు భద్రతా ప్రమాణాలను పాటిస్తుంది. DOT, ISI, ECE 22.06 సర్టిఫికేషన్ ను కలిగి ఉంటుంది. అదే సమయంలో దీని ధర కూడా తక్కువగానే ఉంటుంది.  ప్రీమియం ధర కాకుండా ఎక్కువ రక్షణ కోరుకునే రైడర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ హెల్మెట్ క్లియర్ ఔటర్ వైజర్, బిల్ట్ ఇన్ సన్ వైజర్ తో కూడిన ఫుల్ ఫేస్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వేడి పరిస్థితులలో చక్కటి ఎయిర్‌ ఫ్లో, డైనమిక్ వెంటిలేషన్ ఛానెల్‌ ను ఉపయోగిస్తుంది. దీని స్పోర్టీ స్టైలింగ్‌ లో ఏరో రియర్ స్పాయిలర్, వాషబుల్ ఇన్నర్ ప్యాడ్‌లు, నైట్ విజిబిలిటీ కోసం రిఫ్లెక్టివ్ ఎలిమెంట్స్, డబుల్ డి రింగ్ ఫాస్టెనర్, నోస్ ప్రొటెక్టర్, విండ్ డిఫ్లెక్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. మల్టీ డెన్సిటీ EPS లైనింగ్ తో పాటు PC ABS షెల్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్‌ను మెరుగు పరుస్తుంది. దీని ధర సుమారు రూ. 6,499 ఉంటుంది.

⦿ కోర్డా ఐకాన్

Advertisement

కోర్డా ఐకాన్ అనేది ఫుల్ ఫేస్ హెల్మెట్. దీని ధర సుమారు రూ.8,499 ఉంటుంది. ఇది మూడు గ్లోబల్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా సర్టిఫై చేయబడింది. ISI, DOT, ECE 22.06 సర్టిఫికేషన్లను కలిగి ఉంది. ఈ హెల్మెట్ బరువు దాదాపు 1,550 గ్రాములు ఉంటుంది. డ్యూయల్ వైజర్ సిస్టమ్‌,  స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో క్లియర్ ఔటర్ వైజర్, ఇంటర్నల్ సన్ వైజర్ ఉన్నాయి. వెంటిలేషన్ ఛానెల్స్, ఏరో రియర్ స్పాయిలర్ ఎయిర్ ఫ్లోను మెరుగుపరుస్తాయి. రేస్ గ్రేడ్ డబుల్ డి రింగ్ స్ట్రాప్, ఎమర్జెన్సీ రిలీజింగ్ ట్యాబ్‌ లను కలిగి ఉంటుంది.

⦿ KYT స్ట్రైకర్ 2

KYT స్ట్రైకర్ 2 అనేది బోల్డ్ స్టైలింగ్, ఇన్ బిల్ట్ సన్ షీల్డ్, మంచి వెంటిలేష న్‌తో క్లియర్ వైజర్ ను కలిగి ఉంటుంది. రూ.7,000 కంటే తక్కువ బడ్జెట్ లో లభిస్తుంది. ఇది ISI సర్టిఫికేట్ పొందింది. స్ట్రాంగ్ థర్మోప్లాస్టిక్ షెల్ కలిగి ఉంది. కళ్ళజోడు స్లాట్లు,  డబుల్ D రింగ్ స్ట్రాప్ కలిగి ఉంది. రోజువారీ ఉపయోగం కోసం కంఫర్ట్ గా ఉంటుంది. సరసమైన ధరకు స్టైల్, ప్రొటెక్షన్  రక్షణ కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది.

⦿ SMK లామినార్

Advertisement

SMK లామినార్ అనేది రోజువారీ రైడింగ్ కోసం తయారు చేసిన ఓపెన్ ఫేస్ హెల్మెట్. ఇది ISI, DOT, ECE 22.06 సర్టిఫికేషన్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.2,799 నుంచి ప్రారంభం అవుతుంది. తేలికైన థర్మోప్లాస్టిక్ షెల్, ఎయిర్ ఫ్లో కోసం స్క్రాచ్ రెసిస్టెంట్ క్లియర్ వైజర్, మన్నికైన, క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్‌ ను కలిగి ఉంటుంది.

⦿ స్టడ్స్ డ్రిఫ్టర్ బ్యాట్‌ మ్యాన్ ఎడిషన్

స్టడ్స్ డ్రిఫ్టర్ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ అనేది బోల్డ్ బ్యాట్‌మ్యాన్ గ్రాఫిక్స్‌ తో కూడిన ఫుల్ ఫేస్ హెల్మెట్. దీనిలో కూడా మంచి వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో ఉంటుంది. డ్యూయల్ వైజర్ సిస్టమ్‌ ను కలిగి ఉంటుంది. క్లియర్ ఔటర్ వైజర్, ఇన్నర్ సన్ వైజర్ తో వస్తుంది. ISI, DOT సర్టిఫికేషన్ ను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ. 2500 నుంచి ప్రారంభం అవుతుంది.

Read Also: ఓ వైపు మంచు, మరోవైపు ఎండ.. రెండింటి నుంచి కాపాడే క్రేజీ హెల్మెట్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×