E-Paper
Advertisement

ఇండియన్ లైసెన్స్‌ తో విదేశాల్లో డ్రైవింగ్.. ఈ 5 ఫారిన్ కంట్రీస్ లో సాధ్యమేనండోయ్!

ఇండియన్ లైసెన్స్‌ తో విదేశాల్లో డ్రైవింగ్.. ఈ 5 ఫారిన్ కంట్రీస్ లో సాధ్యమేనండోయ్!
Advertisement

Indian Driving Licences Are Accepted: భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ తో పలు విదేశీ దేశాల్లో వెహికల్స్ నడిపే అవకాశం ఉంటుంది. కానీ, కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా భారతీయ ప్రయాణికులను విదేశాల్లో ప్రయాణం మరింత ఈజీ అవుతుంది. పాపులర్ డెస్టినేషన్స్ ను ఈజీగా ఎక్స్ ఫ్లోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంతకీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ వాలిడ్ అయ్యే దేశాలు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం..

⦿ యునైటెడ్ కింగ్‌ డమ్

భారతీయులు యూకేలో 12 నెలల పాటు తమ లైసెన్స్‌ తో కార్లు, బైకులు నడిపే అవకాశం ఉంటుంది. లైసెన్స్ ఇంగ్లీష్ లో  ఉండాలి. చాలా సందర్భాల్లో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అవసరం లేదు. 12 నెలల తర్వాత యూకే లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేయాలి.

⦿ ఆస్ట్రేలియా

Advertisement

ప్రతి రాష్ట్రానికి వేర్వేరు డ్రైవింగ్ చట్టాలు ఉన్నాయి. సాధారణంగా మూడు నెలల పాటు లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. లైసెన్స్ ఇంగ్లీష్ లోనే ఉండాలి. కారు, బైక్ నడిపే కేటగిరీలు లైసెన్స్‌ లో మెన్షన్ చేసి ఉండాలి.

⦿ న్యూజిలాండ్

ఇక్కడ 12 నెలల పాటు భారతీయ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉండాలి.  ఆ దేశంలో రహదారుల పరిస్థితులు, భద్రతా నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. పర్యాటకులు స్థానిక చట్టాలను కచ్చితంగా పాటించాలి. ఒకేవళ రూల్స్ ను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు.

⦿ యునైటెడ్ స్టేట్స్

Advertisement

అమెరికాలో ప్రతి రాష్ట్రానికి వేర్వేరు రూల్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో మూడు నెలల వరకు భారతీయ లైసెన్స్‌ తో వాహనాలు నడేపే అవకాశం ఉంటుంది. కానీ, కారు రెంటెల్ కంపెనీలకు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ అవసరం ఉంటుంది. మోటార్‌ సైకిల్‌ లకు కొన్ని అడిషనల్ చెకింగ్స్ ఉంటాయి.

⦿ కెనడా

కెనెడాలో ప్రతి ప్రావిన్స్‌ కు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. భారతీయ లైసెన్స్ కలిగిన వారు 60–90 రోజుల పాటు వాహనం నడిపే అవకాశం ఉంటుంది. లైసెన్స్ ఇంగ్లీష్ లో ఉండాలి. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తరచుగా అడుగుతారు.  కార్లు, మోటార్‌ సైకిళ్లను నడపడానికి లైసెన్స్‌ లోని కేటగిరీలను మెన్షన్ చేయాల్సి ఉంటుంది.

ఈ దేశాల్లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌ తో వాహనం నడపడం సులభం. కానీ, ముందు సంబంధిత చట్టాలు, అవసరమైతే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్, స్థానిక నియమాలు పరిశీలించడం తప్పనిసరి. ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే విదేశీ టూర్ ను హ్యాపీగా పూర్తి చేసుకోవచ్చు.

Read Also: థాయ్‌ లాండ్, బాలి ఎందుకు దండగ.. భారత్‌ లోనే వాటిని తలదన్నే టూరిస్ట్ స్పాట్స్ ఉండగా!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×