దేశంలో శీతాకాలం తీవ్ర స్థాయికి చేరుతోంది. పలు ప్రాంతాల్లో హిమపాతం కురుస్తుంది. పొద్దున్నే ఎక్కడిక్కడ పొగమంచు కురుస్తుంది. దట్టమైన పొగమంచు విజుబులిటీని భారీగా తగ్గిస్తుంది. ప్రమాదకరమైన డ్రైవింగ్ పరిస్థితులకు కారణమవుతుంది. హైవేలలో ఇటీవల పొగమంచు కారణంగా బోలెడు ప్రమాదాలు జరిగాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. చల్లదనం కారణంగా వెహికిల్ అద్దం బయటి నుంచే కాకుండా లోపల కూడా పొగమంచు ఏర్పడుతుంది. శీతాకాలంలో పొగమంచును నివారించడానికి, సమర్థవంతంగా తొలగించడానికి సాధారణ హక్స్ ఉన్నాయి. సురక్షితమైన శీతాకాలపు డ్రైవింగ్ కోసం ప్రతి డ్రైవర్ తెలుసుకోవలసిన 5 టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా కార్లు ముందు, వెనుక డీఫాగర్లు, డిమిస్టర్లతో అమర్చబడి ఉంటాయి. డీఫాగర్ ను ఆన్ చేసి, ACని ఫ్రెష్ ఎయిర్ మోడ్‌లో పెట్టాలి. క్యాబిన్ గాలి నుంచి తేమను తొలగించడానికి, విండ్ స్క్రీన్ ను వేగంగా క్లియర్ చేయడానికి AC సహాయపడుతుంది. రీసర్క్యులేషన్ మోడ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇది లోపల తేమ ఉండేలా చేస్తుంది.
వెచ్చని, తేమతో కూడిన గాలి చల్లని గాజు ఉపరితలాన్ని తగిలినిప్పుడు పొగమంచు ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత, తేమను సమతుల్యం చేయడానికి కిటికీలను కొద్దిగా తెరవండి. వెంటిలేషన్ మోడ్ ఆన్‌తో HVAC వ్యవస్థను ఉపయోగించడం వల్ల కిటికీలను క్రిందికి తిప్పాల్సిన అవసరం లేదు. లోపల పొగమంచు పేరుకుపోదు.
యాంటీ ఫాగ్ స్ప్రేలు, వైప్స్ తేమ పెరుగుదలను నిరోధించే గాజుపై సన్నని పొరను క్రియేట్ చేస్తాయి. ఈ ప్రొడక్ట్స్ఆన్ లైన్ లో, దుకాణాలలో విస్తృతంగా అందుబాటులో ఉంటాయి. DIY హ్యాక్ కోసం, నీరు, వెనిగర్ మిశ్రమం తాత్కాలిక పరిష్కారంగా పని చేస్తుంది.
దుమ్ము, ధూళి తేమను ఆకర్షిస్తుంది. పొగమంచు పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మంచి గ్లాస్ క్లీనర్ తో మీ విండ్ స్క్రీన్ ను శుభ్రం చేయాలి. మచ్చలు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అద్దం ఉపరితలం ఫాగింగ్ ను తగ్గించడమే కాకుండా శీతాకాలపు వర్షం సమయంలో వైపర్ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
తడి షూ, తడి మ్యాట్లు, శ్వాస తీసుకోవడం కూడా క్యాబిన్ కు తేమను యాడ్ చేస్తుంది. త్వరగా ఆరిపోయే, తడి వస్తువులను తొలగించే ఫ్లోర్ మ్యాట్లను ఉపయోగించండి. వీలైతే, తేమను తగ్గించడానికి కారు లోపల సిలికా జెల్ ప్యాక్‌లను ఉపయోగించడం మంచిది.
విండ్ స్క్రీన్‌పై పొగమంచు వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. భద్రతకు పెను ముప్పుగా మారుతుంది. ఈ ఐదు చిట్కాలను ఉపయోగించడం ద్వారా స్పష్టమైన దృశ్యమానతను పొందడంతో పాటు ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. పొగమంచుతో కూడిన భారతీయ రోడ్లపై సురక్షితంగా ఉండటానికి జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో పాటు సరైన లైటింగ్ తో ఈ చిట్కాలను ఫాలో కావడం వల్ల ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చు.
Read Also: జస్ట్ రూ. 1.9 లక్షలు.. చీపెస్ట్ ఇండియన్ మేడ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది!