E-Paper
Advertisement

ముహూర్తం ఆగిపోతుందనగా ఎంట్రీ ఇచ్చిన ‘స్విగ్గీ’.. పెళ్లి మండపంలో సీన్ మామూలుగా లేదుగా!

ముహూర్తం ఆగిపోతుందనగా ఎంట్రీ ఇచ్చిన ‘స్విగ్గీ’.. పెళ్లి మండపంలో సీన్ మామూలుగా లేదుగా!
Advertisement

Wedding Delivery : పెళ్లిళ్లంటేనే మన దేశంలో పెద్ద పండగ. హడావిడి, డ్యాన్సులు. ఇక ఆహడావిడి మధ్యలో ఏదో ఒక వస్తువు మర్చిపోవడం లేదా తక్కువవ్వడం చాలా కామన్. సాధారణంగా ఇలాంటి టైమ్‌లో ఇంట్లోని కుర్రాళ్లు ఏం చేస్తారు?బైక్ వేసుకుని బజారుకు పరుగులు తీస్తారు. కానీ, అదంతా అప్పుడు గురూ ..ట్రెండ్ మారింది ..జస్ట్ చేతిలో ఫోన్ ఉంటె చాలు అంటుంది ఇప్పటి జెన్ జీ బ్యాచ్. అవును ..ఎలా అంటారా ..విషయంలోకి వెళ్దాం.

అసలు విషయం ఏంటంటే

Advertisement

రీసెంట్‌గా ఒక కళ్యాణ మండపంలో జరిగిన వింత సంఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి పీటల మీద హోమం జరుగుతుండగా, మంత్రాల మధ్యలోకి అకస్మాత్తుగా హెల్మెట్ ధరించిన ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. అందరూ అతన్ని చూసి ‘వీడెవడ్రా బాబూ.. మధ్యలో వచ్చాడు?’ అనుకునే లోపే, అతను ఒక బ్యాగ్ నుంచి కావాల్సిన కర్రాలని తీసి అందించాడు.అసలు విషయం ఏంటంటే, పెళ్లి వేడుకలో హోమ గుండానికి కావాల్సిన ‘సమిధలు’ (కట్టెలు) మధ్యలో అయిపోయాయి. పూజ ఆపే పరిస్థితి లేదు, బయటకు వెళ్లి తెచ్చే తీరిక ఎవరికీ లేదు. సరిగ్గా ఆ సమయంలో పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు తెలివిగా ఆలోచించి స్విగ్గీ ఇన్స్టామార్ట్‌లో ఆర్డర్ చేసేశారు. ఇంకేముంది, కేవలం 10 నిమిషాల్లోనే ఆ డెలివరీ బాయ్ పెళ్లి మండపం వద్ద ప్రత్యక్షమై ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. సుప్రియ మట్టపల్లి అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు 8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.

also read :రంగంలోకి దిగిన టాప్ ప్రొడ్యూసర్స్.. ఎగ్జిబిటర్ల సమ్మెకు చెక్ పడేనా?

Advertisement

ఇండియాలో ఏదైనా సాధ్యమే

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇండియాలో ఏదైనా సాధ్యమే!” అని కొందరంటే, “టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదే” అని మరికొందరు తెగ పొగిడేస్తున్నారు.ఇక ఈ వీడియోపై స్విగ్గీ అఫీషియల్ గా రియాక్ట్ అవుతూ ఇచ్చిన రిప్లయ్ హైలైట్‌ అవుతుంది.”ఔర్ కుచ్ చాహియే?” (ఇంకేమైనా కావాలా?) అంటూ స్విగ్గీ సరదాగా కామెంట్ చేయడంతో నెటిజన్ల నవ్వులకు అడ్డులేకుండా పోయింది. “రేపు పొద్దున తాళిబొట్టు లేదా అక్షింతలు మరిచినా స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అంటూ తెగ మీమ్స్ చేసేస్తున్నారు నెటిజన్స్.

also read :చిరంజీవి హీరోయిన్ మిస్టరీ డెత్.. స్టార్ హీరోలతో సినిమాలు.. 26 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ.. చివరకు ఇలా

స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు

నిజానికి ఈ వీడియో ఫన్నీ గా ఉన్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘క్విక్ కామర్స్’ సేవలు మన లైఫ్ లో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. గతంలో ఇలాంటి చిన్న వస్తువుల కోసం గంటల కొద్దీ వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ముహూర్తం సమయానికి వస్తువులు అందకపోయినా, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అన్నంతగా పరిస్థితి మారిపోయింది. మొత్తానికి ఆ డెలివరీ బాయ్ సమయస్ఫూర్తితో పెళ్లిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయించాడంటూ వచ్చిన గెస్ట్ లు కూడా అతన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇకపై పెళ్లిళ్లలో పూజారి ‘లిస్టు’ ఇచ్చేటప్పుడు, పక్కనే స్విగ్గీ యాప్ కూడా ఓపెన్ చేసి ఉంచుకోవాలేమో అని జోకులు వేస్తున్నారు సోషల్ మీడియా వారియర్స్.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×