E-Paper
Advertisement

Driving Licence: 5 నిమిషాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్.. ఔనా? నిజమా?

Driving Licence: 5 నిమిషాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్.. ఔనా? నిజమా?
Advertisement

ఈ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం తీవ్రమైన ట్రాఫిక్ వాయిలేషన్ కిందికి వస్తుంది. పెద్ద మొత్తంలో జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రమాదాలకు కారణం అయితే, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే, గత కొద్ది రోజులులగా జస్ట్ 5 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు అంటే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

5 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ వెనుక అసలు నిజం!

సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా భారత రవాణా వ్యవస్థ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సంస్కరణల కారణంగా బాగా డిజిటలైజ్ చేయబడింది. ఆధార్ ఇంటిగ్రేషన్, AI-ప్రొక్టర్డ్ పరీక్షలు, డిజిటల్ డౌన్‌ లోడ్‌ తో అనేక ప్రక్రియలు ఆన్‌ లైన్‌ లో పొందే అవకాశం ఉంది.  అయితే, 5 నిమిషాల్లో లైసెన్స్ వెనుక అసలు నిజం ఏంటంటే.. అది కేవలం లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే.

Advertisement

Read Also:  కొత్తదంటూ ‘యాక్సిడెంట్’ కారు విక్రయం, టాటా షోరూమ్ లో రచ్చ.. ఇవి తెలియకపోతే ఇంతే!

18 ఏళ్ల వయసున్న యుతీ యువకులు ఈ లైసెన్స్ తీసుకోవచ్చు. ముందుగా sarathi.parivahan.gov.in పోర్టల్ కు వెళ్లాలి. రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. లెర్నర్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఫారమ్ నింపాలి.  అవసరమైన ఆధార్, ఫోటో, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.  ఆన్ లైన్ లోనే ఫీజు చెల్లించాలి.  ఆన్‌ లైన్ లెర్నర్స్ పరీక్ష రాయాలి. ట్రాఫిక్ నియమాలపై మల్టిఫుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ముఖ కదలికల గుర్తింపు, ఆధార్ ప్రామాణీకరణతో AI-ప్రొక్టర్ చేయబడతాయి. ఈ పరీక్షలో పాస్ అయితే, లెర్నర్స్ లైసెన్స్ ఆమోదించబడుతుంది. డిజిటల్, PDF కాపీగా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. చాలా మంది వినియోగదారులు ఇంటి నుంచి 5 నుంచి 15 నిమిషాల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ లెర్నర్స్ లైసెన్స్ కు 6 నెలలు చెల్లిబాటు వ్యవధి ఉంటుంది. 5 నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ వీడియోలు LLని మాత్రమే సూచిస్తాయి. శాశ్వత లైసెన్స్ కాదు.

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కు ఎంత సమయం పడుతుంది?   

Advertisement

శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం 30 రోజుల LLని కలిగి ఉండాలి. చాలా సందర్భాలలో తప్పనిసరి RTO డ్రైవింగ్ పరీక్ష ఉంటుంది. ముందు సారథి పోర్టల్ ద్వారా బుక్ స్లాట్ చేసుకోవాలి. ఆమోదించబడిన కేంద్రంలో డ్రైవింగ్ పరీక్ష పూర్తి చేసుకోవాలి. ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శాశ్వత డ్రైవింట్ లైసెన్స్ స్మార్ట్ కార్డ్ రూపంలో లభిస్తుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ సాధారణంగా 20 సంవత్సరాలు లేదంటే 40/50 సంవత్సరాల వయస్సు వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

Read Also:  అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×