E-Paper
Advertisement

తనకు తానే లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చుకున్న అజయ్ దేవగన్, కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

తనకు తానే లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చుకున్న అజయ్ దేవగన్, కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

Ajay Devgn Luxury Car Collection: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 57వ పుట్టిన రోజును ఈసారి ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆయన తనకు తానుగా ఓ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చుకున్నారు. ఈ కారు ధర సుమారు రూ. 1.4 కోట్లు ఉంటుంది. ఆ కారు మరేదో కాదు మెర్సిడెస్ బెంజ్ V క్లాస్.  విశాలమైన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లతో ఈ కారు బాగా పాపులర్ అయ్యింది. ఈ కారును చక్కటి సౌకర్యం, స్టైల్‌ ను ఇష్టపడే సెలబ్రిటీలు ఎంతగానో ఇష్టపడుతారు. అయితే, అజయ్ దగ్గర ఈ కారుతో పాటు పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఆయన దగ్గర ఉన్న హై పర్ఫార్మెన్స్ లగ్జరీ కార్లు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం..

⦿ BMW X7

అజయ్ కార్ కలెక్షన్‌ లో కనిపించే లగ్జరీ కారు BMW X7. ఇది BMW కంపెనీ ఫ్లాగ్‌ షిప్ SUVగా పేరుపొందింది. ఇందులో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పవర్‌ ఫుల్ ఇంజన్‌ తో పాటు, అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటుంది. సుదూర ప్రయాణాలకు ఈ కారు అనుకూలంగా ఉంటుంది.

⦿ BMW i7 ఎలక్ట్రిక్ కారు

Advertisement

అజయ్ దగ్గర పూర్తిగా ఎలక్ట్రిక్ కారైన BMW i7 కూడా ఉంది. ఈ కారులో ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. మంచి రేంజ్ ను అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కారణంగా తక్కువ సమయంలోనే ఛార్జ్ అవుతుంది. ఈ కారు ఆయన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు తరచుగా కనిపిస్తుంది.

⦿ మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ S450

అజయ్ గ్యారేజీలో ఉన్న మరో ప్రీమియం సెడాన్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ S450. ఈ కారు ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీకి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్ డ్రైవింగ్, అత్యాధునిక టెక్నాలజీ, కంఫర్ట్ గా ఉంటుంది.

⦿ మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600

Advertisement

అజయ్ తరచుగా వాడే కారు మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600.  ఇది అత్యంత విలాసవంతమైన SUV. పవర్ ఫుల్ ఇంజన్, అద్భుతమైన ఇంటీరియర్, ప్రీమియం ఫీచర్లతో ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది. పవర్, లగ్జరీ రెండింటినీ కలిపిన ఈ కారు మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

Read Also: బజాజ్ బైక్‌ లలో కొత్త ట్రెండ్, ఇంజిన్ 400cc నుంచి 350ccకి తగ్గింపు!

 ఇంతకు ముందు ఆయన దగ్గర రోల్స్ రాయ్స్ కల్లినన్, BMW 7 Series కార్లు కూడా ఉండేవి. ప్రస్తుతం ఆయన దగ్గర ఈ కార్లు లేవని తెలుస్తోంది. మొత్తంగా అజయ్ దేవ్‌ గన్ దగ్గర పలు లజర్నీ కార్లు ఉన్నాయి. తాజాగా కొత్త మెర్జిడెస్ బెంజ్ V క్లాస్ కొనడంతో.. లగ్జరీ కార్లపై ఆయనకు ఎంత ఇష్టం ఉన్నదో అర్థం అవుతుంది.

Read Also: బ్యాటరీ అయిపోయినా ప్రయాణం ఆగదు, విన్ ఫాస్ట్ నుంచి క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×