E-Paper
Advertisement

ఇరాన్ యుద్ధం వేళ బాంబు పేల్చిన ట్రంప్.. ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్, వాటిపై 50 శాతం!

ఇరాన్ యుద్ధం వేళ బాంబు పేల్చిన ట్రంప్.. ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్, వాటిపై 50 శాతం!
Advertisement

Trump Tariff: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి మారలేదా? టారిఫ్ విషయంలో ఆ దేశ న్యాయస్థానం మొట్టికాయలు వేసినా వెనక్కి తగ్గలేదా? తాజాగా ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఫలితంగా దేశీయ ఫార్మా కంపెనీలు అప్పుడే ఆలోచనలో పడ్డాయా? అవుననే అంటోంది ఆ పరిశ్రమ.

ఇరాన్ యుద్ధం వేళ బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఏ మాత్రం మారలేదు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం వేళ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్‌ను ఆ దేశ న్యాయస్థానం రద్దు చేసినా వెనక్కి తగ్గలేదు. తాజాగా మరోసారి ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటన చేయడం ఆ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

కొన్ని రకాల పేటెంట్ ఔషధాలపై 100 శాతం సుంకాలను అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు. అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలను ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే పేటెంట్‌, ఇతర ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు ఉండవు. ఒప్పందం చేసుకోని కంపెనీలకు సుంకాలు వర్తిస్తాయని ఆర్డర్‌లో ప్రస్తావించారు.

Advertisement

ఫార్మా ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్.. వాటిపై 50 శాతం

అలాంటి సంస్థలు ఉత్పత్తి చేసే ఔషధాలపై 20 శాతం నుంచి 100 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తామన్నారు. టారిఫ్‌లను అమలు చేసేందుకు కొంత గడువు విధించినట్టు తెలుస్తోంది. చర్చల కోసం పెద్ద కంపెనీలు వస్తే 120 రోజులు, మిగతా సంస్థలకు 180 రోజుల గడువు ఇచ్చారు. కొన్ని కంపెనీలు చర్చలు జరిపి డీల్స్‌పై సంతకాలు చేసినట్లు సమాచారం.

ఐరోపా, జపాన్, సౌత్‌కొరియా, స్విట్జర్లాండ్‌తో సహా ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలున్న ప్రాంతాల సంస్థలు సుమారు 15 శాతం కంటే తక్కువ టారిఫ్‌లు ఎదుర్కొంటాయి. యూకే ఆధారిత కంపెనీలు సుమారు 10 శాతం సుంకాలకు లోబడి ఉన్నాయట. ధరల రాయితీలు, దేశీయ పెట్టుబడులకు బదులుగా తాత్కాలిక సుంకాల ఉపశమనాన్ని అందిస్తూ డజనుకు పైగా ఔషధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకుంది.

ALSO READ: షాకింగ్ న్యూస్.. సామాన్యులకు షాక్ ఇస్తూ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

ఇరాన్ యుద్ధం వేళ ఆయిల్ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశాల ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులపై టారిఫ్‌ పెంపుతో ఆ పరిశ్రమ కలకలం మొదలైంది. దీంతోపాటు స్టీల్‌, అల్యూమినియం, రాగి ఉత్పత్తుల దిగుమతులపై కొన్ని మార్పులు చేశారు. వాటిపై 50శాతం టారిఫ్‌ వసూలు చేసే విధానం వచ్చే సోమవారం నుంచి అమల్లోకి రానుంది. దీనిపై కూడా ఆయన సంతకం చేశారు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×