E-Paper
Advertisement

Hydrogen SUV: భలే కారు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు.. ఛార్జింగ్ గోల లేదు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు!

Hydrogen SUV: భలే కారు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు.. ఛార్జింగ్ గోల లేదు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు!

NAMX Hydrogen SUV: పర్యావరణహితమైన కార్లలను రూపొందించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమోబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ లభించే కార్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఒక్క ఛార్జ్ మీద ఏకంగా 500 కి.మీ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికి భిన్నంగా ఆఫ్రో-యురోపియన్ కంపెనీ సరికొత్త హైడ్రోజన్ కారును అందుబాటులోకి తీసుకురాబోతోంది. NAMX అనే ఈ కంపెనీ హైడ్రోజన్ పవర్ తో నడిచే ప్రీమియం SUV కారును రూపొందించింది. ఇటాలీ డిజైన్ కంపెనీ ఫినినర్ఫారినా(Pininfarina)తో కలిసి డిజైన్ చేసింది. ఇది ఫ్యూచరిస్టిక్ లుక్ తో పాటు జీరో ఎమిషన్స్ తో అందుబాటులోకి రాబోతోంది.

NamX SUV ప్రత్యేకత

HUV అని పిలువబడే ఈ కారు తొలి హైడ్రోజన్ SUVగా గుర్తింపు తెచ్చుకోనుంది. బయటకు తీసే హైడ్రోజన్ ప్యూయెల్ క్యాప్సుల్ సిస్టమ్ కలిగిన మొట్ట మొదటికారు ఇదే కావడం విశేషం. ప్రపంచ ఆటోమోబైల్ కంపెనీలకు ఇదో దిక్సూచిగా మారబోతోంది. ఈ కారు ఎలక్ట్రిక్ కారులా ఉన్నా, ఎలాంటి కాలుష్యకారకాలను విడుదల చేయదు. బ్యాటరీ స్థానంలో హైడ్రోజన్ ప్యూయెల్ క్యాప్సుల్స్ వినియోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ స్టేషన్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రోజన్ క్యాప్సుల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కారు వెనుక భాగంలో  6 హైడ్రోజన్ క్యాప్సుల్స్ ఉంటాయి. ఒక్కో క్యాప్సుల్ 800 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ క్యాప్సుల్స్ ను ఎక్కడ హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ఉంటే, అక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు.

రెండు వేరియంట్లలో NamX SUV

NamX SUV రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. RWD (300 Ps), మరింత శక్తివంతమైన GTH (550 Ps)తో విడుదలకానున్నట్లు తెలుస్తుంది. 300 hp ఎంట్రీ లెవల్ తో వచ్చే ఈ కారు 6.5 సెకెన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంకుటుంది. టాప్ స్పెక్ GTH వెర్షన్ ఫోర్ వీల్ డ్రైవ్, 550 hpని కలిగి ఉంటుంది. ఇది 4.5 సెకెన్లలో 0-100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 200 కి.మీతో ప్రయాణిస్తుంది.  ఈ కారు ధర సుమారు రూ. 60-90 లక్షల ఉంటుందని భావిస్తున్నారు.

హైడ్రోజన్ ప్యూయెల్ గా ఎలా ఉపయోగిస్తారు?

ఈ కారులో ప్యూయెల్ క్యాప్సుల్స్ వాడుతారు. బ్యాటరీతో నడిచే కారుతో పోల్చితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్యూయెల్ క్యాప్సుల్స్ లోని హైడ్రోజన్ గాలిలో ఉండే ఆక్సిజన్ తో కెమికల్ రియాక్షన్ జరుపుతుంది. విద్యుత్ శక్తిగా మారి కార్లు నడుస్తాయి. ఈ ఇంధనం పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. భూమ్మీద ఉన్న మూలకాల్లో హైడ్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ ను తక్కువ ఖర్చుతో ఇంధనంగా మార్చేందుకు పరిశోధనలు కూడా కొనసాగుతున్నాయి.

2026లో డెలివరీలు ప్రారంభం

NamX SUV ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. డెలివరీస్ 2026 మొదలవుతాయి. ఇప్పటి వరకు ఏరోడైనమిక్ టెస్ట్స్ పూర్తయ్యాయి, రోడ్ టెస్ట్స్ ఇంకా జరుగుతున్నాయి. ఇది హైడ్రోజన్ స్టేషన్ల సమస్యను సాల్వ్ చేయడానికి రూపొందించిన కారు.

Read Also: అత్యంత చౌకగా మారుతి మినీ బస్, ఇదీ అసలు సంగతి!

Related News

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

పెట్రోల్‌ తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కొత్త వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ప్రత్యేకతలు ఇవే!

Big Stories

×