E-Paper
Advertisement

Fastest Bikes Under Rs 5 Lakh: అప్రిలియా RS 457 To కవాసకి నింజా 300.. 5 లక్షల్లోపు బెస్ట్ ఫాస్టెస్ట్ బైక్స్ ఇవే!

Fastest Bikes Under Rs 5 Lakh: అప్రిలియా RS 457 To కవాసకి నింజా 300.. 5 లక్షల్లోపు బెస్ట్ ఫాస్టెస్ట్ బైక్స్ ఇవే!
Advertisement

ఈ రోజుల్లో యువత అదిరిపోయే ఫాస్టెస్ట్ బైక్స్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్పోర్ట్స్ లుక్ లో జూమ్ అంటూ దూసుకెళ్లే రూ. 5 లక్షల్లోపు బైక్స్ మార్కెట్ లో బోలెడు ఉన్నాయి. ఈ బైక్స్ వీకెండ్ రైడ్స్, సిటీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. పెర్ఫార్మెన్స్ బైకింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న కొత్త రైడర్ల కోసం, దేశంలో అత్యంత వేగవంతమైన 5 బైక్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ అప్రిలియా RS 457

ఈ బైక్ ధర రూ. 4.22 లక్షలు ఉంటుంది. దీని 457cc సమాంతర ట్విన్ ఇంజిన్ 47.6 PS, 43.5 Nm ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మంచి వేగాన్ని అందిస్తుంది. ఈ బైక్ దాదాపు 190 కి.మీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. ఐదు సెకన్లలోపు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

⦿ KTM RC 390

Advertisement

రూ. 3.22 లక్షల ధరతో ప్రారంభమైన KTM RC 390.. చాలా కాలంగా వేగంతో పాటు మలుపులను కూడా ఇష్టపడే రైడర్లను ఆకట్టుకునే బైక్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని 373cc ఇంజిన్ 43.5 PS పవర్ ను అదిస్తుంది. 170–179 కి.మీ/గం.కు  గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఈ బైక్ అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్, క్విక్ షిఫ్టర్, రేస్ ప్రేరేపిత డైనమిక్స్‌ తో ఆకట్టుకుంటుంది.

⦿ KTM డ్యూక్ 390

మరింత సౌకర్యవంతంగా, థ్రిల్లింగ్  రైడ్ ను కోరుకుంటే, కొత్త తరం KTM డ్యూక్ 390 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని ధర రూ. 2.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. 399cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 45 PS పవర్, 39 Nm పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. డ్యూక్ వేగం, రేజర్ లాంటి దూకుడును కలిగి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత అగ్రెసివ్ స్ట్రీట్‌ ఫైటర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 167 కి.మీ.

Advertisement

Read Also: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

⦿ TVS Apache RR 310

ఈ బైక ధర రూ. 2.59 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. TVS Apache RR 310 అత్యంత అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి. దీని 312cc ఇంజిన్ 38 PS వరకు ఉత్పత్తి చేస్తుంది. బైక్  ఫీచర్లు పలు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది. దాదాపు 160-164 km/h గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.

Read Also: టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV, ఇండియాలో అడుగు పెట్టేది ఎప్పుడంటే?

⦿ కవాసకి నింజా 300

ఈ బైక్ ధర రూ. 3.17 లక్షలతో ప్రారంభం అవుతుంది. కవాసకి నింజా 300 మంచి వేగాన్ని అందిస్తుంది. దాని 296cc సమాంతర ట్విన్ మోటార్ చాలా మృదువుగా ఉంటుంది. హై రివ్‌లను ఇష్టపడుతుంది. ఈ బైక్ రిఫైన్డ్ పనితీరు, బలమైన హైవే క్రూజింగ్ సామర్థ్యం, సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ కు ప్రసిద్ధి చెందింది.

Read Also:  దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 1993లోనే వచ్చింది, కానీ సక్సెస్ కాలేకపోయింది, ఎందుకంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×