E-Paper
Advertisement

Toyota Reveals 2026 C-HR EV: టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV, ఇండియాలో అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Toyota Reveals 2026 C-HR EV: టయోటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV, ఇండియాలో అడుగు పెట్టేది ఎప్పుడంటే?
Advertisement

జపనీస్ ఆటోమేకర్ టయోటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ ఫోలియోలో భాగంగా 2026 C-HR కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని లాంచ్ చేసింది. టయోటా C-HR మోడల్ అథ్లెటిక్, కూపే లాంటి ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్‌ను అందించే డ్యూయల్ మోటార్ సిస్టమ్ ద్వారా పవర్ ను పొందుతుంది. 338 hp  సామర్థ్యాన్ని కలిగి ఉన్న C-HR జస్ట్ 4.9 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

టయోటా C-HR ఫీచర్లు  

C-HR ఎలక్ట్రిక్ SUV మంచి బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది. 717 లీటర్ల స్థలంతో వస్తుంది. ఇది 60:40 స్ప్లిట్‌ను కలిగి ఉంటుంది. వెనుక సీట్లను ఫ్లాట్‌గా మడిచి ఉంచడం ద్వారా బూట్ స్థలాన్ని 1,684 లీటర్ల కార్గో స్థలాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ కారు e-TNGA ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి ఉంది. టయోటా ఆడియో మల్టీమీడియా సిస్టమ్‌ను కంట్రోల్ చేసే  14-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది స్మార్ట్‌ ఫోన్లు, వాయిస్ యాక్టివేటెడ్ కమాండ్‌ ల కోసం వైర్‌ లెస్ ఇంటిగ్రేషన్‌ను మరింత అందిస్తుంది. దానికి తోడు, ఇది JBL నుంచి తొమ్మిది స్పీకర్ల సెటప్‌, 8 ఛానల్ 800 వాట్ యాంప్లిఫైయర్, 9 అంగుళాల సబ్‌ వూఫర్‌ ను కలిగి ఉంటుంది.

టయోటా C-HR బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్

Advertisement

C-HR కాంపాక్ట్ SUV 74.7 kWH బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రతి మోడల్ నార్త్ అమెరికన్ ఛార్జింగ్ సిస్టమ్ పోర్ట్‌ తో అమర్చబడి ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్లకు సంబంధించి మంచి నెట్ వర్క్ అనుసంధానించే అవకాశం ఉంటుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ ని ఉపయోగించి, 74.7-kWh బ్యాటరీ దాదాపు 30 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు రీఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ వేగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి బ్యాటరీ ప్రీకండిషనింగ్, రీ జెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

టయోటా C-HR ఇంటీరియర్, సేఫ్టీ

టయోటా C-HR లోపలి భాగంలో స్లిమ్ డ్రైవర్ డిస్‌ ప్లే, సెంటర్ కన్సోల్‌ తో పాటు యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. SUV రెండు వైర్‌ లెస్ స్మార్ట్‌ ఫోన్ ఛార్జర్లు, వెనుక క్యాబిన్ USB పోర్ట్‌ లు, వెనుక క్యాబిన్ AC కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, C-HR టయోటా సేఫ్టీ సెన్స్ 3.0 తో ప్రామాణికంగా వస్తుంది. ఇది ప్రీ కొలిషన్ వార్నింగ్స్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్‌ తో కూడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుందంటే?

Advertisement

టయోటా C-HR అనేది కాంపాక్ట్ SUV. ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విభాగాలలో ఒకటి. టయోటా ఇటీవల తన తొలి ఎలక్ట్రిక్ వెహికిల్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను లాంచ్ చేసింది. C-HR SUVని టయోటా 2027లో లేదంటే 2028 నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also: అమ్మకాల్లో దుమ్మురేపిన కియా సెల్టోస్, ఏకంగా 6 లక్షల మార్క్ క్రాస్!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×