E-Paper
Advertisement

Bookie Review: ‘బూకి’(పూకి) మూవీ ఫస్ట్ రివ్యూ. ఫుల్ డిటైల్స్.. ఎలా ఉందంటే?

Bookie Review: ‘బూకి’(పూకి) మూవీ ఫస్ట్ రివ్యూ. ఫుల్ డిటైల్స్.. ఎలా ఉందంటే?
Advertisement

Bookie Review: టాలీవుడ్ లో మంచు లక్ష్మి గురించి తెలియని వారుండరు. ఆమె తాజాగా చేసిన తమిళ రామ్ కామ్ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ‘బిచ్చగాడు’ తో తెలుగులో మంచి హిట్ సాధించి అందరికీ సుపరిచితమైన విజయ్ ఆంటొనీ ఈ సినిమాకు సంగీతం అందించి, కామియో రోల్ కూడా చేశారు. మంచి పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Eric Dane: X-Men నటుడు ఎరిక్ డేన్ మృతి..ALS వ్యాధితో పోరాడి..!

కథేంటంటే..

Advertisement

కైలాష్ (అజయ్ దిషాన్), ఆజీ (ధనుషా) ఆరేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ ఒక అర్థరాత్రి జరిగిన చిన్న వాదన వల్ల వారి మధ్య విభేదాలు మొదలవుతాయి. ఆ గొడవ కాస్తా బ్రేకప్‌కు దారి తీస్తుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ‘ఇగో’ (అహం) వల్ల వచ్చే మానసిక సంఘర్షణ, వారి జీవితాల్లో జరిగిన మార్పులే ఈ సినిమా అసలు కథ.

నటీనటుల పనితీరు

హీరో హీరోయిన్లు: అజయ్, ధనుషా తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. నేటి తరం ప్రేమికులుగా కనిపించడానికి ప్రయత్నించారు కానీ, వారి మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు.

Advertisement

 మంచు లక్ష్మి: ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన మంచు లక్ష్మి తన నటనతో మెప్పించారు. సినిమాకు ఆమె పేరు ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

విజయ్ ఆంటోని: నటుడిగానే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టింది.

Read also-Toxic Teaser: యశ్ టాక్సిక్ టీజర్ రిలీజ్.. ఊహించని ట్విస్ట్ అదుర్స్!

సాంకేతిక విభాగం

దర్శకుడు గణేష్ చంద్ర నేటి తరం రిలేషన్‌షిప్స్‌లో ఉండే ఇగో పాయింట్‌ను బాగానే ఎంచుకున్నారు. కానీ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో తడబడ్డారు. సినిమా చాలా నెమ్మదిగా సాగుతుంది. విజువల్స్ బాగున్నాయి కానీ, ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది.

ప్లస్ పాయింట్స్

విజయ్ ఆంటోని సంగీతం

మంచు లక్ష్మి స్క్రీన్ ప్రెజెన్స్

నేటి తరం జంటల మధ్య ఉండే ‘ఇగో’ అనే పాయింట్.

మైనస్ పాయింట్స్

మరీ నెమ్మదిగా సాగే కథనం

సినిమాలో ఎమోషన్ లోపించడం

సెకండ్ హాఫ్ అంతా చాలా డల్ గా అనిపించడం

ముగింపు – ‘బూకీ’ సినిమా కేవలం జెన్-జీ (Gen-Z) ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాలో కలర్‌ఫుల్ విజువల్స్ ఉన్నా, ప్రేక్షకుల మనసును తాకే బలమైన కథాబలం లేదు. కేవలం యూత్ మాత్రమే ఒకసారి ప్రయత్నించవచ్చు.

రేటింగ్: 1.75/5

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×