Ather 450 Apex vs Ather 450X Comparison: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో ఏథర్ సత్తా చాటుతోంది. ఈ కంపెనీకి చెందిన క్రేజీ ఈవీలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. వీటిలో ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450X మంచి అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఏథర్ 450 అపెక్స్ అనేది 450X వేగవంతమైన, పరిమిత ఎడిషన్. 10వ వార్షికోత్సవం సందర్భంగా దీనిని విడుదల చేశారు. 7kW మోటార్తో పాటు గంటకు 100 కిమీ టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. 2.9 సెకన్లలో 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే 3.7kWh బ్యాటరీ, ఛాసిస్‌ను పంచుకుంటూ, అపెక్స్ ప్రత్యేకమైన ట్రాన్స్ పరెన్స్ ప్యానెల్స్, వార్ప్ ప్లస్ మోడ్, 450X కంటే మెరుగైన మ్యాజిక్ ట్విస్ట్ రీ జెనరేటివ్ బ్రేకింగ్‌ను కలిగి ఉంటుంది. ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450X మధ్య తేడాలు ఏంటి? వాటి ఫీచర్లు, పనితీరు ఎలా ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఏథర్ 450 అపెక్స్, ఏథర్ 450X మధ్య తేడాలు
⦿ పనితీరు, మోటార్: ఏథర్ 450X 6.4 kW మోటారుతో పోలిస్తే ఏథర్ 450 అపెక్స్ లో పవర్ ఫుల్ 7 kW మోటారు ఉంటుంది. అపెక్స్ గరిష్టంగా గంటకు 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 2.9 సెకన్లలో 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అయితే, 450X గరిష్టంగా గంటకు 90 కిమీ వేగాన్ని అందుకుంటుంది. 3.3 సెకన్లలో 0-40 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
⦿ డిజైన్: ఏథర్ 450 అపెక్స్ పారదర్శకతో కూడిన సైడ్ ప్యానెల్స్, డిఫరెండ్ కలర్స్ షేడ్స్ ఉంటుంది. ప్రత్యేకమైన యెల్లో పెయింట్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.
⦿ ఫీచర్లు: ఏథర్ 450 అపెక్స్ లో మ్యాజిక్ ట్విస్ట్ ఉంది. ఇది థొరెటల్ ను వెనుకకు 15 డిగ్రీల వరకు తిప్పడం ద్వారా ఎక్కువ వేగాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది సాంప్రదాయ బ్రేక్ లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
⦿ రైడింగ్ మోడ్స్: వేగవంతమైన పికప్ కోసం ఏథర్ 450 అపెక్స్ వార్ప్ ప్లస్ మోడ్ ను పరిచయం చేసింది. అయితే 450X ప్రామాణిక వార్ప్ మోడ్‌ను ఉపయోగిస్తుంది.
⦿ ధర: అపెక్స్ ప్రీమియం ధరతో పాటు పరిమిత ఆఫర్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర (ఎక్స్ షోరూమ్) ధర రూ.1.91 లక్షలు ఉంటుంది. ఇది ఏథర్ 450X కంటే ఎక్కువ. దీని ధర రూ. 1.48 లక్షల నుంచి రూ. 1.80 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.
Read Also: దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు 1993లోనే వచ్చింది, కానీ సక్సెస్ కాలేకపోయింది, ఎందుకంటే?
⦿ఒకే ఛార్జ్ తో రేంజ్: ఏథర్ 450 అపెక్స్ 157 కి.మీ. IDC సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉండగా, 450X సుమారు 126 కి.మీ IDC సర్టిఫైడ్ రేంజ్‌ను ఇస్తుంది. రియల్ వరల్డ్ విషయానికి వచ్చే సరికి అపెక్స్ సుమారు 120 కి.మీ, 450X సుమారు 110-120 కి.మీ రేంజ్ ను అందిస్తాయి.
ఈ రెండు స్కూటర్లు 450 సిరీస్ ప్లాట్ ఫామ్‌ను పంచుకుంటాయి. అయితే, అపెక్స్ గరిష్ట వేగం, పనితీరు యూత్ ను బాగా ఆకట్టుకునేలా ఉంటుంది.
Read Also: వచ్చేసింది మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?