E-Paper
Advertisement

Hyderabad: అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం, కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు

Hyderabad: అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం, కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ అమీర్‌పేట్ ప్రాంతంలోని మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో సిబ్బందిపడ్డారు.

అమీర్‌పేట్ మైత్రివనంలోని ఓ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం

Advertisement

శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో అమీర్‌పేట్‌ మైత్రివనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  దట్టమైన పొగలు వెలువడుతుండటంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. ఆ క్లాంపెక్సులో వివిధ రకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఘటన సమయంలో విద్యార్థులు కోచింగ్ సెంటర్లలో ఉన్నారు. వారంతా నాలుగో అంతస్తులో చిక్కుకున్నారు.

పైన చిక్కుకున్న వారిని బాల్కనీ నుండి కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. పవర్ బాక్స్‌లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. దీంతో వివిధ ఫ్లోర్లలోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ బ్లాక్ ఉన్న కొంతమంది దీన్ని గమనించారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. రెండు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని సహయకచర్యల్లో నిమగ్నమయ్యాయి.

Advertisement

కోచింగ్ సెంటర్‌లో చిక్కుకున్న విద్యార్థులు

పవర్ బాక్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగినట్టు ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. పొగలు రావడంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. నీలగిరి బ్లాక్ లో ఎక్కువగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. వివిధ రకాల కోర్సులకు సంబంధించి విద్యార్థులు అక్కడ శిక్షణ పొందుతున్నారు. అందులోనూ ఆ కాంప్లెక్స్ నిత్యం రద్దీగా ఉంటోంది.

గ్రౌండ్ ఫ్లోర్ లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. నిచ్చెన సాయంతో దాదాపు 60 మంది విద్యార్థులను కిందకు దించారు ఫైర్ సిబ్బంది. సకాలంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఎండాకాలం ఇంకా రాకముందు ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థులు కంగారు పడుతున్నారు.

ALSO READ: జీహెచ్ఎంసీ విభజనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

అగ్నిప్రమాదం ఘటన గురించి కీలక విషయాలు వెల్లడించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కేబుల్ ప్యానెల్స్ బర్న్ కావడంతో ప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదం వల్ల పెద్ద ఎత్తున స్మోక్ రావడం జరిగిందని, ఆ సమయంలో దాదాపు 50 మంది స్టూడెంట్ వరకు ఉన్నట్లు తెలిపారు. పొగలు అలముకున్న వెంటనే బాల్కనీ వైపు వారంతా వచ్చారని, ఫైర్-హైడ్రా సిబ్బంది కలిసి వారిని సురక్షితంగా కిందకు దించినట్టు వెల్లడించారు.

బాల్కనీ వైపు రావడానికి వీల్లేకుండా పాడైన వస్తువులను ఉంచారని, అదృష్టవశాత్తు ప్రమాదం ఫైర్ కేబుల్ వరకే పరిమితం అయ్యిందన్నారు. జీహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ-హైడ్రా- అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా మంటలను అదుపులోకి తెచ్చినట్టు వివరించారు. ఫైర్ ఎక్సిస్ట్ కావడానికి అవకాశం లేదని, వచ్చే నెల నుండి ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పర్యవేక్షణ చేస్తామన్నారు. నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని అన్నారు కమిషనర్.

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×