E-Paper
Advertisement

Ather 450 Apex vs Suzuki E Access: ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్, రెండింటిలో ఏది బెస్ట్?

Ather 450 Apex vs Suzuki E Access:  ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్, రెండింటిలో ఏది బెస్ట్?

భారతీయ మార్కెట్లో క్రేజీ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ఖర్చులో మంచి రేంజ్ ఇచ్చే స్కూటర్లు బోలెడు విడుదల అయ్యాయి. వాటిలో రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వాటిలో ఒకటి ఏథర్ 450 అపెక్స్ కాగా, మరొకటి సుజుకి ఇ-యాక్సెస్.  ఏథర్ 450 అపెక్స్ గంటకు 100 కిలో మీటర్ల వేగంల ప్రయాణిస్తుంది. ఒకే ఛార్జ్ తో 157 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. అధునాతన మ్యాజిక్ ట్విస్ట్ బ్రేకింగ్‌ తో కూడిన ఫాస్ట్ ఫార్మాన్సీకి పాపులర్. ఇక సుజుకి ఇ-యాక్సెస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఒకే ఛార్జ్ తో 95 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు స్కూటర్లలో ఏథర్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.

 ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్ మధ్య పోలిక

ఏథర్ 450 అపెక్స్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. సుమారు రూ. 2 లక్షల ప్రారంభం ధరతో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 157 కిలో మీటర్ల IDC రేంజ్ ను కలిగి ఉంటుంది. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ 3.7 kWh బ్యాటరీ, 7 Kw మోటార్ తో వస్తుంది. మ్యాజిక్ ట్విస్ట్ బ్రేకింగ్, వార్ప్ మోడ్ రైడింగ్ ను కలిగి ఉంటుంది. 111.6 కేజీల బరువు ఉంటుంది.

సుజుకి ఇ-యాక్సెస్:  ఏథర్ ధరతో పోల్చితే ఈ స్కూటర్ ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.88 లక్షలు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 95 కిలో మీటర్ల రేంజ్ అందిస్తుంది. గంటకు 80 నుంచి  90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 3.072 kWh బ్యాటరీ, 4.1 Kw మోటార్ ను కలిగి ఉంటుంది. అల్మినియం బ్యాటరీ హౌసింగ్, TFT డిస్ ప్లేతో వస్తుంది. ఈ స్కూటర్ బరువు 122 కేజీలు ఉంటుంది.

Read Also: రివోల్ట్ బంపర్ ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్స్ పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు !

ఏథర్ 450 అపెక్స్ vs సుజుకి ఇ-యాక్సెస్ మధ్య తేడాలు

⦿ పనితీరు: ఏథర్ 450 అపెక్స్ బెస్ట్ యాక్సిలరేషన్ ను కలిగి ఉంటుంది. 2.9 సెకెన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

⦿ రేంజ్: లాంగ్ రైడ్స్ కోసం ఏథర్ 450 అపెక్స్ అనుకూలంగా ఉంటుంది.

⦿ కంఫర్ట్: సుజుకి ఇ-యాక్సెస్ కుటుంబ అవసరాలకు, సౌకర్యవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

⦿ బ్రేకింగ్: ఏథర్ అపెక్స్‌ లోని  మ్యాజిక్ ట్విస్ట్  వన్ పెడల్ డ్రైవింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. నగరంలో ప్రయాణానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఒకవేళ మీరు హై పర్ఫార్మెన్స్, టెక్నాలజీని ఇష్టపడితే ఏథర్ 450 అపెక్స్, కుటుంబం అవసరాల కోసం బడ్జెట్ ధరలో మంచి ఈవీ కావాలంటే సుజుకి ఇ-యాక్సెస్ మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also:  రివోల్ట్ To ఓలా రోడ్‌ స్టర్.. బెస్ట్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే!

Related News

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

Big Stories

×