E-Paper
Advertisement

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!

సింగిల్ ఛార్జ్‌ తో 301 కి.మీ రేంజ్.. ఓలా S1Z స్కూటర్ వచ్చేసింది!
Advertisement

Ola S1Z Electric Scooter Launched: ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌ లో ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక ముందడుగు వేసింది. తాజాగా S1Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఓలా స్వయంగా అభివృద్ధి చేసి తయారు చేసిన LFP బ్యాటరీ సెల్స్‌ ను ఉపయోగించింది. మాస్ మార్కెట్ కోసం సొంతంగా తయారు చేసిన బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఓలా తొలి స్కూటర్ ఇదే కావడం విశేషం.

ధరలు, వేరియంట్ల గురించి..

ఓలా S1Z రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 3.1 kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999గా ఉండగా, 5.1 kWh వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. లక్ష రూపాయలలోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇదో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Advertisement

S1Zలో ఉపయోగించిన బ్యాటరీ సెల్స్ ఓలా భారత్ సెల్ ప్లాట్‌ఫామ్‌లో భాగం. వీటిని కంపెనీ బెంగళూరులో అభివృద్ధి చేసి, తమిళనాడులోని గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. సాధారణంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లలో ఉపయోగించే NMC బ్యాటరీలతో పోలిస్తే LFP బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాగే ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. బ్యాటరీ సెల్స్‌ను బయట నుంచి దిగుమతి చేసుకోవడం కంటే, సొంతంగా తయారు చేయడం ద్వారా ఖర్చును తగ్గించుకోవాలని ఓలా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రయోజనాన్ని తక్కువ ధర రూపంలో వినియోగదారులకు అందించాలని చూస్తోంది.

రేంజ్ ఎంత?

ఓలా S1Z 3.1 kWh వేరియంట్ పూర్తి ఛార్జ్‌ తో IDC ప్రకారం 179 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. మరోవైపు, 5.1 kWh బ్యాటరీ వేరియంట్ 301 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని వెల్లడించింది. రోజువారీ ప్రయాణాలతో పాటు ఎక్కువ దూరం వెళ్లే వారికి పెద్ద బ్యాటరీ వేరియంట్ ఉపయోగకరంగా ఉంటుంది.

ఫీచర్లలో కూడా తగ్గేదేలే!

Advertisement

ఈ స్కూటర్ ఓలా MoveOS 5 సాఫ్ట్‌ వేర్‌ తో పనిచేస్తుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ మోడ్, GPS నావిగేషన్, OTA అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే జియో, టైమ్, మోడ్ ఫెన్సింగ్ ద్వారా స్కూటర్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో పరిమితులు పెట్టుకోవచ్చు. కుటుంబ సభ్యులు, ఫ్లీట్ వినియోగదారులకు  ఉపయోగపడుతుంది. ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ చేయడానికి ఈజీ పార్క్ ఫీచర్ కూడా అందించారు.

డెలివరీలు ఎప్పటి నుంచి?

3.1 kWh వేరియంట్ డెలివరీలు డిసెంబర్ 2026లో ప్రారంభం కానున్నాయి. 5.1 kWh వేరియంట్ మాత్రం మార్చి 2027 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. వైట్, ఆంత్రాసైట్, స్కై స్ప్లాష్ బ్లూ, మచ్చా గ్రీన్ అనే నాలుగు రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తుంది.

Read Also: జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

Tags

Related News

ఇండియన్ మార్కెట్‌ను షేక్ చేయబోతున్న 6 కొత్త SUVలు.. లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే!

టాటా పంచ్ EV ఒరిజినల్ రేంజ్ ఎంత? రియల్ టెస్ట్‌ లో షాకింగ్ రిజల్ట్!

మహీంద్రా EVలపై భారీ ఆఫర్.. ఏకంగా రూ.8 లక్షల తగ్గింపు!

జావా 42 FJ లాంచ్.. 6 అదిరిపోయే రంగుల్లో అందుబాటులోకి!

జస్ట్ లక్షకే.. 200 కి.మీ రేంజ్.. ఏథర్ కోనార్క్ వచ్చేసింది!

లాంగ్ రైడర్లకు అదిరిపోయే బైక్.. కవాసకి వెర్సిస్ 650 కొత్త వెర్షన్ వచ్చేసింది!

హ్యుందాయ్ నుంచి ఏకంగా 26 కొత్త కార్లు.. టాప్ 7 మోడళ్లు ఏవో తెలిస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×