E-Paper
Advertisement

KTR: సిట్ విచారణ ఒక కార్తీకదీపం సీరియల్.. సీఎం రేవంత్ ఓ లీక్ వీరుడు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: సిట్ విచారణ ఒక కార్తీకదీపం సీరియల్.. సీఎం రేవంత్ ఓ లీక్ వీరుడు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని, సిట్ విచారణ తీరును ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు.

సిట్ విచారణ అంటే ‘స్టే ఇన్ టౌన్’..

Advertisement

సిట్ అంటే సిట్ లాగా.. కూర్చోమంటే కూర్చునేలా విచారణ సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా కార్తీకదీపం సీరియల్ లాగా, అంతులేని కథలాగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అసలు సిట్ విచారణలే ఒక పెద్ద డ్రామా అని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే వీటిని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టిన వెంటనే తనకు సిట్ నోటీసులు రావడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డికి అర్హత లేకపోయినా అమృత్ టెండర్లు కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. నిజంగా విచారణ జరపాలంటే రేవంత్ బామ్మర్దిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ‘ఆర్ఆర్ (RR) టాక్స్ అమలవుతోందని మేం చెబుతుంటే, మరి బిజెపి ఏం చేస్తోంది?’ అని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం బక్వాస్ కేసు అని, రాజకీయ లబ్ధి కోసమే సృష్టించిన ట్రాప్ కేసు అని కొట్టిపారేశారు.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ ఒక నిరంతర ప్రక్రియ.. 

ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ.. 1952 నుండి దేశ రక్షణ, శాంతిభద్రతల కోసం ఈ ప్రక్రియ కొనసాగుతోందని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతి ప్రభుత్వం గూఢచారి వ్యవస్థపై ఆధారపడుతుందని, అది పోలీసులు చేసే పని అని స్పష్టం చేశారు. 2017లో మా ఎమ్మెల్యేలను కొంటూ ఓ సన్నాసి దొరికినప్పుడు, పోలీసులు ఆ సంభాషణలు విన్నారేమో.. అది రాజ్యాంగబద్ధంగా జరిగిన ప్రక్రియ అని సమర్థించుకున్నారు. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ అవ్వడం లేదా? అని ప్రశ్నించారు.

విచారణలో భాగంగా పోలీసులు సమాచారం సేకరించడం సహజమని, నిజంగా విచారించాల్సి వస్తే ఇంటెలిజెన్స్ ఐజీ, డీజీలను పిలవాలని సూచించారు. ‘శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి ఉన్నతాధికారులకు తెలియకుండానే ఇదంతా జరిగిందా?’ అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని ‘లీక్ వీరుడు’గా అభివర్ణిస్తూ.. ఈ కేసును లొట్టపిసు కేసుగా అభివర్ణించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల వైఫల్యం నుండి తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఏ విచారణకైనా సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు.

ALSO READ: KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు, ఇక జైలుకేనా..?

Related News

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

Big Stories

Advertisement
×