E-Paper
Advertisement

ఇక అన్నికార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం!

ఇక అన్నికార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. కేంద్రం సంచలన నిర్ణయం!
Advertisement

AEBS for New Cars From 2030: దేశంలో కార్ల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. దేశంలో అమ్మే ప్రతి ప్యాసింజర్ కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEBS) తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH) ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రమాదాలను తగ్గించడంలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

2030 నుంచి కొత్త కార్లలో తప్పనిసరి..

తాజా ప్రతిపాదన ప్రకారం, 2028 అక్టోబర్ 1 నుంచి AEBS అమర్చిన M1, N1 కేటగిరీ వాహనాలు AIS 185 భద్రతా ప్రమాణాలను పాటించాలి. ఇక 2030 అక్టోబర్ 1 నుంచి విడుదలయ్యే కొత్త కార్ల మోడళ్లలో AEBS తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. అప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్లకు అదనంగా రెండేళ్ల గడువు ఇవ్వనున్నారు. అంటే, ఈ నిబంధన 2032 అక్టోబర్ 1 నుంచి వాటికి వర్తించేలా ప్రతిపాదించారు. M1 కేటగిరీలో డ్రైవర్‌ తో పాటు ఎనిమిది మంది వరకు ప్రయాణించే కార్లు, SUVలు ఉంటాయి. అయితే, ఇవి ప్రస్తుతం ముసాయిదాలో ఉన్న ప్రతిపాదనలు మాత్రమే. ఫైనల్ రూల్స్ ఖరారైన తర్వాతే పూర్తి వివరాలపై క్లారిటీ వస్తుంది.

ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?

Advertisement

డ్రైవర్ ముందున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయినా, సమయానికి బ్రేకులు వేయకపోయినా AEBS రియాక్ట్ అవుతుంది.  ఇతర అసిస్టెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రమాదాన్ని గుర్తించి అవసరమైనప్పుడు వెహికల్ కు ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. దీంతో ప్రమాదం జరగకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వ్యవస్థ ఉన్నంత మాత్రాన ప్రమాదాలు పూర్తిగా జరగవని చెప్పలేం. డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కూడా తప్పనిసరి.

స్టీరింగ్, లేన్ కీపింగ్ రూల్స్ కూడా..

ఈ ముసాయిదాలో ఆటోమేటిక్ బ్రేకింగ్‌తో పాటు స్టీరింగ్, లేన్ కీపింగ్ వ్యవస్థలకు సంబంధించిన నిబంధనలను కూడా చేర్చారు. 2027 అక్టోబర్ 1 నుంచి బైక్ లు, త్రీ-వీలర్లకు కొన్ని మినహాయింపులతో స్టీరింగ్ ఎఫర్ట్‌ కు AIS-193 ప్రమాణాలను వర్తింపజేయాలని ప్రతిపాదించారు. ఆటోమేటిక్ కమాండ్ స్టీరింగ్ వ్యవస్థలు ఉన్న కార్లకూ ఈ ప్రమాణాలు వర్తించనున్నాయి. అలాగే, ఎమర్జెన్సీ లేన్ కీపింగ్ సిస్టమ్ (ELKS) ఉన్న వెహికల్స్ AIS-191 పార్ట్ 1 ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ వాహనం అనుకోకుండా లేన్ నుంచి పక్కకు వెళ్లకుండా డ్రైవర్‌కు సాయం చేస్తుంది.

టాక్సీలకు మరిన్ని భద్రతా ఫీచర్లు?

Advertisement

2029 అక్టోబర్ 1 నుంచి రవాణా వాహనాలుగా రిజిస్టర్ అయ్యే M1 కార్లకు ఆటోమేటిక్ కమాండ్ స్టీరింగ్ ఫంక్షనాలిటీ (ACSF), ఎమర్జెన్సీ లేన్ కీపింగ్ సిస్టమ్ (ELKS) తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. టాక్సీలకు డ్రైవర్ నిద్రమత్తు, అప్రమత్తత తగ్గడాన్ని గుర్తించే హెచ్చరిక వ్యవస్థలు కూడా అవసరమయ్యే అవకాశం ఉందని నివేదికలు వెల్లడించాయి. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి MoRTH 30 రోజుల గడువు ఇవ్వనుంది. వాటిని పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read Also: ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

Tags

Related News

సింగిల్ ఛార్జ్ తో 650 కి.మీ రేంజ్.. 2026 ఎండింగ్ లో రానున్న కొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఏప్రిలియా RS 660 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది, రేసింగ్ లుక్ అదుర్స్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పడిపోదు.. భారత్‌లో కొత్త BMW మోడల్ కు పేటెంట్!

హ్యుందాయ్ బేయాన్ ధర రేపే విడుదల.. బేసిక్ మోడల్ రేటు ఎంత ఉండొచ్చంటే?

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

Big Stories

Advertisement
×