E-Paper
Advertisement

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!

ఢిల్లీలో కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి ఆ వెహికల్స్ కు నో ఎంట్రీ!
Advertisement

Delhi Vehicle Ban 2026: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. శీతాకాలంలో కాలుష్యం పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనుంది. నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు ఢిల్లీ బయట రిజిస్టర్ అయి, BS6 కాని వాహనాలను నగరంలోకి అనుమతించరు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్ణయం మేరకు అధికారులు ఈ చర్యలు చేపడుతున్నారు.

BS6 కానీ వాహనాలకు నో ఎంట్రీ..

ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన.. BS6 కానీ వాహనాలు నిర్ణీత గడువులో ఢిల్లీలోకి ఎంట్రీ కావు. అయితే, ఎలక్ట్రిక్ వెహికల్స్,  సీఎన్‌జీ వెహికల్స్, ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన వాహనాలకు మినహాయింపులు ఉంటాయి. ఈ నిషేధం మూడు నెలల పాటు అమల్లో ఉండనుంది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం, శీతాకాలంలో ఎయిర్ క్వాలిటీ మరింత దిగజారకుండా చూడటం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పీయూసీ సర్టిఫికేట్ లేకపోతే నో ఫ్యూయల్..

Advertisement

వాహనదారులకు మరో కీలక నిబంధన కూడా అమలు చేయనున్నారు. ఢిల్లీలోని ఫ్యూయల్ సెంటర్స్ లో పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌పీజీ అందించరు. వాహనాల పొల్యూషన్  నియంత్రించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల వాహనదారులు తమ పీయూసీ సర్టిఫికేట్ గడువు ముగియకుండా చూసుకోవడం అవసరమన్నారు.

పార్కింగ్ ఫీజులు రెట్టింపు..

కాలుష్య నియంత్రణలో భాగంగా పార్కింగ్ రుసుములపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఢిల్లీ మెట్రో పార్కింగ్ స్థలాలను మినహాయించి,  మున్సిపల్ పార్కింగ్ కేంద్రాల్లో ఫీజులను రెట్టింపు చేయనున్నారు. దీంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి, ప్రజా రవాణా వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.

50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్

Advertisement

ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కూడా ప్రకటించారు. ఉద్యోగుల పనివేళలను వేర్వేరుగా అమలు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు సైతం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉంటాయి.

ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని సూచన

మెట్రో రైళ్లు, ఎలక్ట్రిక్ బస్సులు, కార్‌పూలింగ్ వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.  ఈ విధానం ఫిబ్రవరి 28 వరకు కొనసాగనుంది. వాహన కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడం, ఢిల్లీ ప్రజలకు చక్కటి గాలి అందించడం కోసం ఈ చర్యలు చేపడుతున్నారు.

Read Also: లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

Tags

Related News

లోకో పైలట్లకు జీరో ఆల్కహాల్ రూల్.. రైల్వే బోర్డు షాకింగ్ డెసిషన్!

బాబోయ్.. ఇది రైలా? హోటలా? ఇండియన్ రైల్వేపై ఫారిన్ కఫుల్ ప్రశంసలు!

వావ్.. ఫ్రీగా కుల్ఫీ పార్టీ.. గోల్డెన్ అంకుల్ అదిరిపోయే ఆఫర్!

భోగాపురం నుంచి ఢిల్లీకి విమాన సర్వీసు.. పెరుగుతున్న కనెక్టివిటీ, ప్రయాణికుల్లో ఒకటే ఆనందం

హిమాలయాల్లో రైల్వే రూట్.. ఏకంగా 80 శాతానికి పైగా భూగర్భంలోనే!

ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు ఈజీగా రీఫండ్ అవుతాయి!

ఏపీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

Big Stories

Advertisement
×