E-Paper
Advertisement

Manual vs Automatic Cars: ఆటోమేటిక్ vs గేర్ కార్లు, రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?

Manual vs Automatic Cars: ఆటోమేటిక్ vs గేర్ కార్లు, రెండింటి మధ్య తేడాలేంటి? ఏది బెస్ట్?
Advertisement

Automatic vs Manual Cars in India: భారతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఆటోమేటిక్, మాన్యువల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల మధ్య ప్రధాన తేడా గేర్లు మార్చే విధానంలో ఉంటుంది. ఆటోమేటిక్ కార్లలో క్లచ్ పెడల్ ఉండదు. గేర్లు వాటంతట అవే మారుతాయి. ఇవి సిటీ  ప్రయాణానికి సులభంగా ఉంటాయి. మాన్యువల్ కార్లలో డ్రైవర్ క్లచ్, గేర్ లివర్ ద్వారా గేర్లు మార్చాల్సి ఉంటుంది. ఇవి ఎక్కువ నియంత్రణ, ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని అందిస్తాయి.

ఆటో కార్లు vs గేర్ కార్ల మధ్య కీలక తేడాలు

⦿ కంట్రోల్, డ్రైవింగ్: ఆటోమేటిక్ కార్లలో క్లచ్ పెడల్ లేకపోవడం వల్ల ట్రాఫిక్‌లో డ్రైవింగ్ ఒత్తిడి తగ్గుతుంది. మాన్యువల్ కార్లలో డ్రైవర్ గేర్లపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది కొండ ప్రాంతాలు, వేగవంతమైన డ్రైవింగ్‌కు మంచిది.

Advertisement

⦿ ధర, మెయింటెనెన్స్: ఆటోమేటిక్ కార్లు సాధారణంగా మాన్యువల్ కార్ల కంటే ధర ఎక్కువగా ఉంటాయి. ఆటోమేటిక్ కార్ల ధరలు మాన్యువల్ తో పోల్చితే సుమారు రూ.50,000 నుంచి రూ. 70,000 వరకు ఎక్కువగా ఉంటాయి. మాన్యువల్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. రిపేర్లు ఈజీగా చేయించుకోవచ్చు.

⦿ మైలేజ్ లో ఏది బెస్ట్?: మాన్యువల్ కార్లు సాధారణంగా ఆటోమేటిక్ కార్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తాయి. అయినప్పటికీ, ఆధునిక ఆటోమేటిక్ కార్లు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.

Advertisement

⦿ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్: ఆటోమేటిక్ కార్లు కొత్త డ్రైవర్లకు డ్రైవింగ్ చాలా సులభంగా, సురక్షితంగా ఉంటుంది. మాన్యువల్ కార్లు డ్రైవింగ్ నేర్చుకోవడానికి,  కార్లపై పట్టు సాధించడానికి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ రిసేల్ వాల్యూ: మాన్యువల్ కార్లకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆటో మేటిక్ కార్లు కాస్త రీసేల్ వ్యాల్యూ తక్కువగా ఉంటాయి.

Read Also: కారు ఎంత స్పీడ్ లో వెళ్తే పెట్రోల్ సేవ్ అవుతుంది? హైవేలో ఎంత? సిటీలో ఎంత?

ఆటోమేటిక్, మాన్యువల్ కార్లలో ఏది కొంటే మంచిది?   

⦿ సిటీ ట్రాఫిక్ కు ఆటోమేటిక్ కార్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు.

⦿ లాంగ్ డ్రైవ్, హైవే ప్రయాణాలకు మాన్యువల్ కార్లు మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందిస్తాయి.

⦿ బడ్జెట్ తక్కువ బడ్జెట్ లో కారు కొనుగోలు చేయాలనుకుంటే మాన్యువల్ కారును కొనుగోలు చేయడం మంచిది.

⦿ ఆటోమేటిక్ కార్లు సులభమైన ప్రయాణాన్ని, మాన్యువల్ కార్లు తక్కువ ఖర్చు, ఎక్కువ నియంత్రణను అందిస్తాయి.

మొత్తంగా నగరంలో ఎక్కువగా ట్రాఫిక్‌లో ప్రయాణించే వారికి ఆటోమేటిక్ కార్లు మంచిది. రేసింగ్, పవర్ డ్రైవింగ్ ఇష్టపడేవారికి, తక్కువ బడ్జెట్‌లో కారు కావాలనుకునేవారికి మాన్యువల్ లేదంటే గేర్ కార్లు సరైన ఎంపికగా చెప్పుకోవచ్చు.

Read Also: ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?

Related News

క్లాసిక్ లుక్.. మోడ్రన్ టెక్నాలజీ.. ట్రయంఫ్ బోన్నెవిల్ T40 వచ్చేసింది!

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×