E-Paper
Advertisement

Most Expensive Electric Car: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Most Expensive Electric Car: ఇది ప్రపంచంలోనే కాస్లీయెస్ట్ ఎలక్ట్రిక్ కారు, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Advertisement

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఎక్కువ రేంజ్, అద్భుతమైన ఫీచర్లతో ఎప్పటికప్పుడు సరికొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఏది? దాని ధర ఎంత ఉంటుంది? ఫీచర్లు ఎలా ఉంటాయి? అని తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఆటోమొబిలి పినిన్‌ఫరీనా B95. ఇదో అద్భుతమైన  అల్ట్రా ఎక్స్ క్లూజివ్ ఎలక్ట్రిక్ హైపర్‌ కారు. దీనిని ప్రపంచంలోని తొలి హైపర్ బార్చెట్టా అని పిలుస్తారు. ఈ కారును భారత్ కు చెందిన మహీంద్రా & మహీంద్రా లిమిటెట్ యాజమాన్యంలోని ఆటోమొబిలి పినిన్‌ఫరినా GmbH తయారు చేసింది. ఈ కారును ఫైటర్ జెట్ నుంచి ప్రేరణ పొంది తయారు చేశారు.  పైకప్పు లేని డిజైన్, అడ్జెస్ట్ చేసేలా ఉన్న ఏరో స్క్రీన్లు, పవర్ ఫుల్ 1900 PS ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్, బెస్పోక్ లగ్జరీని కలిగి ఉంటుంది. ఈ కార్లు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 10 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో కారు ప్రారంభ ధర సుమారు $4.8 మిలియన్లు. భారత కరెన్సీలో ఈ ధర సుమారు రూ. 439.5 కోట్లు.  క్లాసిక్ ఇటాలియన్ స్టైలింగ్‌ తో ఫ్యూచర్ టెక్నాలజీని మిక్స్ చేస్తూ  దీనిని తయారు చేశారు.

బార్చెట్టా కీ ఫీచర్ల, డిజైన్ గురించి.. 

Advertisement

బార్చెట్టా ఎలక్ట్రిక్ కారు విండ్‌ షీల్డ్ లేకుండా రాడికల్, ఓపెన్ టాప్ తో ఉంటుంది. రెండు సీట్ల డిజైన్ ను కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఎలక్ట్రానిక్ అడ్జెస్టబుక్ ఏరో స్క్రీన్లను కలిగి తొలి కారు ఇదే కావడం విశేషం. ప్రయాణీకులను అత్యంత సురక్షితంగా ఉంచుతుంది. ఇది ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్ ను కలిగి ఉంటుంది. రేస్ కారు శైలి సీట్లు, డిజిటల్ డిస్‌ప్లేలను అనుసంధానించే ప్రత్యేకమైన డ్రైవ్ బై వైర్ స్టీరింగ్ వీల్‌తో కూడిన కాన్సెప్ట్ కార్ ప్రేరేపిత కాక్‌ పిట్ ఉంటుంది.

బార్చెట్టా పనితీరు ఎలా ఉంటుందంటే?

బార్చెట్టా ఎలక్ట్రిక్ పవర్‌ ట్రెయిన్ 120 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 1900 PS పవర్ ను అందిస్తుంది. డైనమిక్ హ్యాండ్లింగ్ కోసం టైలర్డ్ టార్క్ వెక్టరింగ్‌తో నాలుగు ఇండిపెండెంట్ మోటార్లను కలిగి ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 270 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 25 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.

Advertisement

Read Also: మహీంద్రా ట్రెయో జోర్ TO యూలర్ హైలోడ్ EV.. బెస్ట్ కార్గో ఎలక్ట్రిక్ ఆటోలు ఇవే!

బార్చెట్టా ప్రత్యేకత ఏంటంటే?

బార్చెట్టా కారును కేవలం 10 యూనిట్లు మాత్రమే తయారు చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ. రూ. 439.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ఈ 10 యూనిట్లు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో ఉండేలా రూపొందిచారు.

Read Also: ఆటో9 అవార్డ్స్ 2026.. ఈవీ స్కూటర్ ఆఫ్ ది ఇయర్ గా సత్తా చాటిన టీవీఎస్ ఆర్బిటర్!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×