E-Paper
Advertisement

పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!

పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!
Advertisement

Pulsar New Models: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో.. తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వచ్చే 6 వారాల్లో ఏకంగా 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇందులో పల్సర్ కు సంబంధించి రెండు అధునాతన మోడల్స్ సైతం ఉండనున్నట్లు బజాజ్ ఆటో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వాహనాల డిమాండ్‌ను తట్టుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

పల్సర్ సిరీస్‌లో కొత్త అధ్యాయం

యువతను విపరీతంగా ఆకట్టుకునే ‘పల్సర్’ బ్రాండ్ నుంచి రెండు సరికొత్త మోడళ్లు రాబోతున్నట్లు రాకేశ్ శర్మ వెల్లడించారు. 125cc, 150cc విభాగాల్లో ఈ కొత్త పల్సర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే నెక్స్ట్ జనరేషన్ ‘పల్సర్ 125’ టెస్టింగ్ దశలో ఉంది. దీనికి సంబంధించి ఫొటోలు ఇప్పటికై సామాజిక మాధ్యమాల్లో వైరల్ కూడా అయ్యాయి. దీంతో 150cc వెర్షన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి.. బైక్ లవర్స్ లో పెరిగిపోయింది.

ఉత్పత్తి సామర్థ్యం 25% పెంపు

Advertisement

మరోవైపు ఇటీవల ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో విడుదలై.. ఎంతో ఆదరణ పొందిన ‘చేతక్’ స్కూటర్ నుంచి కూడా సరికొత్త వేరియంట్లు తీసుకురావాలని బజాజ్ నిర్ణయించింది. అటు కొత్త వాహనాల తాకిడికి అనుగుణంగా బజాజ్ ఆటో.. తన తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏటా 72 లక్షల (7.2 మిలియన్) వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండగా.. దాన్ని ఏకంగా 90 లక్షల (9 మిలియన్) కంటే ఎక్కువ స్థాయికి తీసుకెళ్లాలని బజాజ్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఉత్పత్తిలో 25 శాతానికి పైగా పెరుగుదల నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ఈవీ కోసం ప్రత్యేక ప్లాంటు

ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న ప్లాంట్లలో సౌకర్యాలను విస్తరించడంతో పాటు.. ఒక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కొత్త ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది త్వరలోనే ఖరారు కానుంది. కొత్తగా రాబోయే ప్లాంట్ ను ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు, ప్రీమియం మోటార్ సైకిళ్ల తయారీకి ఉపయోగించుకోవాలని బజాజ్ భావిస్తోంది.

Advertisement

Also Read: బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?

రికార్డు స్థాయి లాభాలు

కాగా, ఇటీవలే ప్రకటించిన ఈ ఏడాది తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాల్లో బజాజ్ ఆటో రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచింది. కంపెనీ రాబడి గతేడాదితో పోలిస్తే 37 శాతం పెరిగి.. రూ. 17,244 కోట్లకు చేరింది. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 14.4 లక్షల (1.44 మిలియన్) వాహనాలను విక్రయించింది. విదేశీ ఎగుమతులు కూడా ఏకంగా 52 శాతం పెరిగి ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేశాయి. ఈ ఆల్ రౌండ్ పురోగతితో బజాజ్ ఆటో మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Also Read: స్పేస్‌లోకి వెళ్లిన భారతీయ ఫుడ్ ఏంటో తెలుసా? శుభాంశు శుక్లా పంచుకున్న స్పెషల్ సీక్రెట్స్!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×