E-Paper
Advertisement

బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?

బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?
Advertisement

Bajaj Electric Bike: బాజాజ్ ఆటో తన ఈవీ (EV) బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో (FY28) కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ ను భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జరిగిన Q1 FY27 ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

స్కూటర్లలో ‘చేతక్’ సత్తా

ఇప్పటికే ‘చేతక్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి అడుగుపెట్టిన బాజాజ్.. ఈ విభాగంలో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో చేతక్ ఒకటిగా నిలిచింది. పెరిగిన డిమాండ్ కు తగినట్లుగా సరఫరా అందించేందుకు ప్రతి నెలా ఉత్పత్తి సామర్థ్యాన్ని 50,000 యూనిట్ల నుండి 60,000 యూనిట్లకు పెంచాలని ఇప్పటికే కంపెనీ నిర్ణయించింది.

ఈవీ బైక్ విభాగంపై కన్ను

Advertisement

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీసీఎస్, హీరో మోటోకార్ప్, ఏథర్ వంటి దిగ్గజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలో ప్రధాన కంపెనీల ప్రాతినిధ్యం తక్కువగా ఉంటూ వస్తోంది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకే బజాజ్ తన మొదటి ఈవీ బైక్‌ను FY28లో తీసుకురావాలని నిర్ణయించింది. కాబట్టి బ్రాండెడ్ కంపెనీల నుంచి మంచి ఎలక్ట్రిక్ బైక్ ను కోరుకునేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Also Read: కంటిలో చిప్ పెడితే.. చూపు వచ్చేస్తుందట.. ఏమన్నా టెక్నాలజీనా!

ప్రీమియం బైక్‌ల సత్తా

Advertisement

ఇదిలా ఉంటే ఏప్రిల్ – జూన్ 2026 త్రైమాసికంలో బాజాజ్ ఎగుమతులు ఏకంగా 7 లక్షల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా ఆఫ్రికా మార్కెట్‌లో అమ్మకాలు రెండింతలు కాగా నైజీరియాలో మూడు రెట్లు పెరిగాయి. బజాజ్ ప్రీమియం బైక్స్ విభాగంలోని పల్సర్, అవెంజర్, డోమినార్ అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. కేటీఎమ్ (KTM), ట్రయంఫ్ (Triumph) బ్రాండ్ల ఆదాయం 60% పెరిగింది. కొత్తగా వచ్చిన ట్రయంఫ్ ట్రాకర్ 400, 350 cc పోర్ట్‌ఫోలియో ఈ ఫలితాలకు ఎంతగానో బూస్టప్ ఇచ్చాయని బజాజ్ ఆటో వర్గాలు తెలిపాయి.

Also Read: రైల్వేలో కొత్త రూల్.. టీసీలకు బాడీ కెమెరాలు.. తప్పు చేస్తే దొరికేస్తారు!

Related News

పల్సర్ ప్రేమికులకు తీపి కబురు.. సరికొత్త 125cc, 150cc మోడల్స్ వచ్చేస్తున్నాయ్..!

పాత వాహనాలు ఉన్నాయా? కేంద్రం అదిరిపోయే ఆఫర్లు.. చలానాలు, ట్యాక్స్ మాఫీ!

మళ్లీ షాకిచ్చిన మారుతి.. ఆగస్టులో మరోసారి కార్ల ధరల పెంపు!

కొత్త టయోటా హిలక్స్ టీజర్ రిలీజ్.. ఈసారి లుక్ మామూలుగా లేదు!

పండుగకు ముందు బజాజ్ బ్లాస్ట్.. ఒకేసారి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

లాంచ్‌కు ముందే బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ సీక్రెట్స్ లీక్.. కొత్త ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

Big Stories

Advertisement
×