E-Paper
Advertisement

స్పేస్‌లోకి వెళ్లిన భారతీయ ఫుడ్ ఏంటో తెలుసా? శుభాంశు శుక్లా పంచుకున్న స్పెషల్ సీక్రెట్స్!

స్పేస్‌లోకి వెళ్లిన భారతీయ ఫుడ్ ఏంటో తెలుసా? శుభాంశు శుక్లా పంచుకున్న స్పెషల్ సీక్రెట్స్!
Advertisement

Space Food: అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ప్రధానంగా మిస్ అయ్యే వాటిలో కుటుంబ సభ్యులతో పాటు.. ప్రాంతీయ వంటకాలు ముందు వరుసలో నిలుస్తాయి. భూమి కంటే భిన్నమైన పరిస్థితులు ఉండే అంతరిక్షంలో నచ్చిన ఆహారాన్ని తినే అవకాశం ఉండదని ఎప్పటి నుంచో వ్యోమగాములు చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా.. తన స్వీయ అనుభవాన్ని తాజాగా ఓ పోడ్ కాస్ట్ లో పంచుకున్నారు. అంతరిక్షానికి తీసుకెళ్లడానికి ఎన్నో రకాల ఫుడ్స్ ఎంపిక చేసుకున్నప్పటికీ.. చివరికీ 3 పదార్థాలు మాత్రమే ప్రయాణానికి అర్హత సాధించాయని ఆయన తెలిపారు.

ఆ మూడింటికి గ్రీన్ సిగ్నల్..

రాజ్ షమానీ పోడ్ కాస్ట్ లో శుభాంశు శుక్లా పాల్గొని మాట్లాడారు. అంతరిక్షంలోని నచ్చిన ఆహారం తీసుకెళ్లడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు. భారత్ త్వరలో చేపట్టబోయే గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం అంతరిక్షంలో పాడవకుండా ఉండే ప్రత్యేకమైన ఆహారాన్ని డీఆర్డీఓలోని ప్రత్యేక లాబోలేటరీ సంస్థ DFRL సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వీలైనన్ని ఎక్కువ భారతీయ వంటకాలను అంతరిక్ష ప్రయోగానికి పంపాలని DFRL భావించినట్లు చెప్పారు. ఇందుకోసం కిచిడీ, పులావ్, కూరగాయల వంటకాలతో పెద్ద మెనూనే సిద్ధం చేశారన్నారు. ల్యాబ్ పరీక్షలు ఆలస్యం కావడంతో సమయాభావం వల్ల చివరికి ‘గాజర్ కా హల్వా’ (Gajar Ka Halwa), ‘పెసరపప్పు హల్వా’ (Moong Dal Ka Halwa), ఆమ్‌రస్ (మామిడి రసం) అంతరిక్షంలోకి అనుమతి పొందాయని స్పష్టం చేశారు.

తోటి వారితో షేరింగ్..

Advertisement

తన వెంట తీసుకెళ్లిన మూడు రకాల వంటకాలను తాను తినలేకపోయినప్పటికీ తనతో పాటు ఉన్న ఇతర దేశాల వ్యోమగాములకు వాటిని రుచి చూపించినట్లు శుక్లా తెలిపారు. ‘అంతరిక్షంలోకి మన సంస్కృతిని, రుచులను తీసుకెళ్లి తోటి వ్యోమగాములతో పంచుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? నా సహచరులు ఆ స్వీట్లను చాలా ఇష్టంగా తిన్నారు’ అని గతేడాది అంతరిక్షయాన అనుభవాలను శుక్లా గుర్తుచేసుకున్నారు.

కారపు పదార్థాల కోసం ఆరాటం

అంతరిక్షంలో భూఆకర్ష శక్తి ఉండదని తెలిసిందే. ఆ మైక్రో గ్రావిటీ వాతావరణంలో మానవ శరీరలో వింత మార్పులు జరుగుతాయని తాజా పోడ్ కాస్ట్ లో శుక్లా తెలిపారు. శరీరంలోని ద్రవాలు తల వైపు ఎక్కువగా ప్రవహించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల వ్యోమగాములకు ముక్కు దిబ్బడతో పాటు రుచి, వాసన చూసే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతరిక్షంలో సోడియం (ఉప్పు) తక్కువ ఉన్న ఆహారాన్ని ఇవ్వడం వల్ల నోరు చప్పగా మారిపోతుందని స్పష్టం చేశారు. దీంతో మిషన్ 13వ రోజు నాటికి తనకు ఉప్పగా, కారంగా ఉండే భారతీయ రుచులు బాగా గుర్తొచ్చాయని ఆయన తెలియజేశారు. ఓ దశలో ఫ్లైట్ సర్జన్‌ను కలిసి ఏవైనా కారంగా ఉండే పదార్థాలు దొరుకుతాయా అని అడిగే పరిస్థితి వచ్చిందని వివరించారు.

Advertisement

Also Read: రైళ్లలో సీట్ల కొరత తీరినట్లే.. త్వరలో 17,000 కొత్త జనరల్, స్లీపర్ కోచ్‌లు!

భూమిపైకి రాగానే సర్ ప్రైజ్..

అంతరిక్ష ప్రయాణం ముగించుకుని భూమిపైకి అడుగుపెట్టిన వెంటనే తన ఫ్లైట్ సర్జన్ సర్ ప్రైజ్ ఇచ్చారని శుక్లా తెలిపారు. ప్రత్యేకంగా అరటికాయ చిప్స్, బాకర్వాడీ సిద్ధం చేసి ఆహ్వానం పలికారన్నారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన తర్వాత ఆ సాధారణ స్నాక్స్ కూడా తనకు అద్భుతమైన రుచిని ఇచ్చాయని పేర్కొన్నారు. తను పొందిన ఈ అనుభవాలన్నీ రాబోయే గగన్‌యాన్ మిషన్ లో మన శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడతాని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మన భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలో మరింత మెరుగైన, స్వదేశీ ఆహారాన్ని పొందుతారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read: హోటల్ గదుల్లో గడియారాలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనుక మిస్టరీ ఇదే!

Related News

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

ఇంట్లోని గాలిని శుభ్రంగా ఉంచుకోవాలా? బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్ వచ్చేసింది

నెలకు రూ.399 మాత్రమే.. 3300GB డేటాతో పాటు 500+ టీవీ ఛానెల్స్ ఫ్రీ!

రూ.50 వేలలోపు కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కడం ఖాయం

పార్టీ లవర్స్‌కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్‌లో మాస్

ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Big Stories

Advertisement
×