Bajaj Avenger Street 220 Launched: బజాజ్ పాపులర్ క్రూయిజర్ బైక్ అవెంజర్ స్ట్రీట్ 220ను భారత మార్కెట్లో మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, పవర్ పుల్ ఇంజిన్ తో క్రూయిజర్ బైక్ లవర్స్ ను మరింతగా ఆకట్టుకోబోతోంది.
రెండు రంగుల్లో విడుదల
కొత్త అవెంజర్ స్ట్రీట్ 220 రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వాటిలో ఒకటి ఎబోనీ బ్లాక్ కాగా, మరొకటి కాక్ టెయిల్ వైన్ రెడ్ ఉన్నాయి. ఈ రెండు కలర్ ఆప్షన్లు కూడా బైక్ కు ప్రత్యేకమైన లుక్ ను అందించాయి. ఎబోనీ బ్లాక్ రంగు క్లాసిక్, ప్రీమియం ఫీల్ ను ఇస్తుంది. మొత్తం బైక్ నలుపు రంగులో ఉండగా, సైడ్ ప్యానెల్స్ మీద ఉన్న కాంట్రాస్టింగ్ గ్రాఫిక్స్ దాని అందాన్ని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ పై ఉన్న డిజైన్ సింపుల్ గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పూర్తిగా బ్లాక్ థీమ్ ను ఇష్టపడే వారికి ఈ వేరియంట్ మంచి ఆప్షన్ గా నిలుస్తోంది.
మరోవైపు, కాక్ టెయిల్ వైన్ రెడ్ రంగు కొంచెం బోల్డ్ లుక్ ను కోరుకునే వారికి నచ్చే అవకాశం ఉంది. ముదురు ఎరుపు రంగుతో పాటు దానికి సరిపోయే గ్రాఫిక్స్ బైక్ కు స్పోర్టీ టచ్ ను అందిస్తున్నాయి. రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించాలనుకునే రైడర్లకు ఈ కలర్ ఆప్షన్ ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే రెండు కలర వేరియంట్లలో కూడా టెయిల్ సెక్షన్ నలుపు రంగులోనే ఉంటుంది. అలాగే ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులు, ఫ్రంట్ మడ్ గార్డ్, అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ ఫినిష్ లో ఉండటం వల్ల బైక్ మొత్తం ప్రీమియం లుక్ ను సొంతం చేసుకుంది.
అవెంజర్ స్ట్రీట్ 220లో 220 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఇదే ఇంజిన్ అవెంజర్ క్రూజ్ 220 మోడల్ లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 8,500 rpm దగ్గర 19 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 7,000 rpm దగ్గర 17.6 nm టార్క్ ను అందిస్తుంది. ఇంజిన్ కు 5-స్పీడ్ గేర్ బాక్స్ ను యాడ్ చేశారు. నగర ప్రయాణాల్లోనే కాకుండా హైవే రైడింగ్ లో కూడా మంచి పనితీరు అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ ను ఇష్టపడే వారికి అవెంజర్ స్ట్రీట్ 220 సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది.
కొత్త బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 ఆకర్షణీయమైన రంగులు, క్లాసిక్ క్రూయిజర్ డిజైన్, నమ్మకమైన 220 సీసీ ఇంజిన్ తో మార్కెట్లో మంచి ఆదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. చౌక ధరలో క్రూయిజర్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా ఉంటుంది.
Read Also: 95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?