E-Paper
Advertisement

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?

95 కి.మీ క్లెయిమ్.. కానీ, నిజంగా ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతో తెలుసా?
Advertisement

సుజుకి భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఈ స్కూటర్‌ లో 3.072 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ ను అందించారు. కంపెనీ ప్రకారం.. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 95 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. అయితే, వాస్తవ పరిస్థితుల్లో ఈ స్కూటర్ ఎంత రేంజ్ ఇస్తుందో తెలుసుకోవడానికి ఇటీవల రేంజ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఏం తేలిందంటే..

ఉదయం 10 గంటలకు టెస్టింగ్ ప్రారంభం

Advertisement

ఈ రేంజ్ టెస్ట్ ఉదయం 10 గంటల సమయంలో ప్రారంభమైంది. అప్పటికి రోడ్లపై సాధారణ స్థాయిలో ట్రాఫిక్ ఉండగా, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పని చేస్తున్నాయి. పరీక్ష కోసం దాదాపు 10 కిలోమీటర్ల పొడవున్న ఓ లూప్ రూట్‌ ను ఎంపిక చేశారు. ఈ మార్గంలో రద్దీగా ఉండే వీధులు, ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే కొంత ఖాళీ రోడ్డు భాగం కూడా ఉంది. సాధారణంగా ఒక వ్యక్తి రోజువారీగా స్కూటర్‌ ను ఎలా ఉపయోగిస్తాడో అదే పరిస్థితులను ఈ పరీక్షలో అనుసరించారు. పరీక్షలో స్కూటర్‌ ను రైడ్-A మోడ్‌ లో నడిపారు. ఈ మోడ్‌ లో రీజెనరేటివ్ బ్రేకింగ్ ఎక్కువగా పని చేస్తుంది. అంటే బ్రేక్ వేసినప్పుడు, వేగం తగ్గించినప్పుడు కొంత శక్తి తిరిగి బ్యాటరీలో స్టోర్ అవుతుంది. రేంజ్‌ ను గరిష్టంగా పెంచే ప్రయత్నం చేయకుండా, సాధారణ వినియోగదారుడు ఎలా నడుపుతాడో అలానే స్కూటర్‌ ను ఉపయోగించారు.

అటు థ్రాటిల్‌ ను కూడా తక్కువగానే ఉపయోగించారు. ఎక్కువ భాగం ప్రయాణంలో స్కూటర్ వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లలోపే ఉంచారు. పెద్ద రోడ్లపై మాత్రమే కొద్దిగా ఎక్కువ వేగంతో ప్రయాణించారు. దీంతో రియల్ వరల్డ్  వినియోగానికి దగ్గరగా ఉండే ఫలితాలను నమోదు అయ్యియి. పరీక్ష ప్రారంభం నుంచి బ్యాటరీ స్థాయి 10 శాతం వరకు తగ్గే వరకు స్కూటర్ పనితీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. యాక్సిలరేషన్, వేగం, రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ స్థిరంగానే కొనసాగాయి. అయితే, బ్యాటరీ 10 శాతం కంటే తక్కువకు చేరుకున్న తర్వాత స్కూటర్ గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లకు పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటరీ స్థాయి 5 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడు వేగం మరింత తగ్గి గంటకు 20 కిలోమీటర్లకు చేరుకుంది. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు స్కూటర్‌ ను నడిపి చివరి ఫలితాన్ని నమోదు చేశారు.

సుజుకి ఇ-యాక్సెస్ ఇచ్చిన రేంజ్ ఎంతంటే?

Advertisement

ఈ పరీక్షలో సుజుకి ఇ యాక్సెస్ మొత్తం 80.5 కిలోమీటర్ల రేంజ్‌ ను అందించింది. కంపెనీ ప్రకటించిన 95 కిలోమీటర్ల రేంజ్‌తో పోలిస్తే ఇది సుమారు 14.5 కిలోమీటర్లు తక్కువ. అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో ఈ రిజల్ట్ బాగానే ఉందని చెప్పుకోచ్చు. రోజువారీ నగర ప్రయాణాలు, ఆఫీస్‌ కు వెళ్లడం, చిన్నపాటి వ్యక్తిగత అవసరాల కోసం ఈ రేంజ్ చాలామందికి సరిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ దూరాలు ప్రయాణించని వారికి ఇ-యాక్సెస్  బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also: మహీంద్రాను దాటేసిన టాటా.. మే 2026 ఈవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డు!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×