E-Paper
Advertisement

పొట్టి రైడర్ల కోసం బెస్ట్ బైక్‌లు.. ఈజీగా నడిపే టాప్ మోడల్స్ ఇవే!

పొట్టి రైడర్ల కోసం బెస్ట్ బైక్‌లు.. ఈజీగా నడిపే టాప్ మోడల్స్ ఇవే!
Advertisement

Best Bikes for Short Riders in India: బైక్ కొనేటప్పుడు ఇంజిన్, మైలేజీ, ఫీచర్లతో పాటు సీట్ హైట్ కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉన్న రైడర్లకు బైక్‌ ను బ్యాలెన్స్ చేయడం, ట్రాఫిక్‌ లో ఆపడం, తిరిగి స్టార్ట్ చేయడం సులభంగా ఉండాలి. అందుకే తక్కువ సీట్ ఎత్తు, తక్కువ బరువు, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కలిగిన మోటార్‌ సైకిళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం భారత మార్కెట్లో పొట్టి రైడర్లకు అనుకూలంగా ఉండే కొన్ని బైక్ లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ / 220 క్రూయిజ్

తక్కువ సీట్ హైట్ కలిగిన బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బజాజ్ అవెంజర్ సిరీస్. అవెంజర్ 220 స్ట్రీట్, 220 క్రూయిజ్ మోడళ్లలో 737 మిమీ సీట్ హైట్ ఉంటుంది. చాలా మంది రైడర్లు సులభంగా కాళ్లను నేలపై ఉంచే అవకాశం ఉంటుంది. 220 సీసీ ఇంజిన్‌ తో వచ్చే ఈ బైక్‌ లు నగర ప్రయాణాలతో పాటు హైవే టూరింగ్‌కు కూడా అనుకూలంగా ఉంటాయి.

2.రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటియోర్ 350

Advertisement

క్రూయిజర్ బైక్‌ లను ఇష్టపడే వారికి మెటియోర్ 350 మంచి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. దీని సీట్ హైట్ 765 మిమీ ఉంటుంది. సీటు ముందు భాగం సన్నగా ఉండటంతో పొట్టి రైడర్లు సౌకర్యంగా కూర్చుంటారు. 350 సీసీ ఇంజిన్, స్మూత్ రైడింగ్ ఎక్స్ పీరియెన్స్, హైవేల్లో మంచి స్టెబులిటీని కలిగి ఉంటుంది.

3.టీవీఎస్ రైడర్ 125

రోజువారీ ప్రయాణాల కోసం మంచి బైక్ కావాలనుకునే వారికి టీవీఎస్ రైడర్ 125 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. 780 మిమీ సీట్ హైట్‌ తో పాటు తక్కువ బరువు ఉండటం వల్ల కొత్త రైడర్లు కూడా దీన్ని ఈజీగా నడిపే అవకాశం ఉంటుంది. మైలేజీ, పనితీరు, ఆధునిక ఫీచర్ల పరంగా కూడా ఈ బైక్ మంచి పేరు సంపాదించింది.

4.రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

Advertisement

రాయల్ ఎన్‌ ఫీల్డ్ శ్రేణిలో పొట్టి రైడర్లకు అత్యంత అనుకూలమైన మోడల్ హంటర్ 350. 790 మిమీ సీట్ హైట్, కాంపాక్ట్ డిజైన్, తక్కువ బరువుతో ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌ లో కూడా ఈజీగా నడపవచ్చు. పెద్ద ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోలిస్తే మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

5.జావా 42

క్లాసిక్ స్టైల్‌ ను ఇష్టపడే వారికి జావా 42 బెస్ట్ ఆప్షన్. దీని సీట్ హైట్ 788 మిమీ. బైక్ బరువు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, బరువు కింద భాగంలో ఉండటం వల్ల బ్యాలెన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. సన్నని ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కారణంగా పొట్టి రైడర్లు కూడా కాళ్లను ఈజీగా కింద పెట్టే అవకాశం ఉంటుంది.

6.యమహా FZ-S FI

సిటీ ప్రయాణాలకు, రోజువారీ వినియోగానికి యమహా FZ-S FI అనుకూలంగా ఉంటుంది. 790 మిమీ సీట్ హైట్, కేవలం 138 కిలోల బరువు ఉండటం వల్ల దీన్ని ఈజీగా హ్యాండిల్ చెయ్యొచ్చు.

Read Also: డుకాటి To హార్లీ.. ఇండియాలో అత్యంత ఖరీదైన 5 బైక్స్ ఇవే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×