E-Paper
Advertisement

సాక్షి శివానంద్‌కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?

సాక్షి శివానంద్‌కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?

Sakshi Shivanand Mystery: సాక్షి శివానంద్ …ఈ  జనరేషన్ కి ఈ పేరు అంతంగా తెలీకపోవచ్చు కాని,90s యూత్ కి పరిచయం అక్కర్లేని పేరిది.యస్..అప్పట్లో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మెగా స్టార్ చిరుతో ‘మాస్టర్’ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా మెప్పించిన సాక్షి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదనే చెప్పాలి.అలా నందమూరి బాలకృష్ణకి జోడీగా ‘వంశోద్ధారకుడు’ చిత్రంలో ట్రెడిషనల్ లుక్‌లో మెప్పించినా, నాగార్జునతో ‘సీతారామరాజు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరత్న’ చిత్రంలో జోడీ కట్టినా.. అది సాక్షి శివానంద్‌కే సాధ్యమైంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన నటనతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది.

సినిమా రంగాని దూరం కావడం ఒక పెద్ద మిస్టరీ

అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఉన్నపళంగా టాలీవుడ్‌కు, మొత్తంగా సినిమా రంగానికే దూరం కావడం అప్పట్లో ఒక పెద్ద మిస్టరీగా మారింది.అయితే సాక్షి సిల్వర్ స్క్రీన్ కి సడెన్ గా గుడ్ బాయ్ చెప్పడం వెనుక ఒక నమ్మలేని షాకింగ్ నిజం దాగుంది.అవును..సాక్షి శివానంద్ కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస ఛాన్స్ లు దక్కించుకున్న సంగతి తెల్సిందే.అదే సమయంలో హిందీలో చేస్తున్న ‘టూమ్’ సినిమా నిర్మాత అండర్‌వరల్డ్‌కు చెందినవాడని తెలిసి  ప్రాణభయంతో ముంబై వదిలి పారిపోయింది.. ఫోన్ నంబర్లు మార్చేసి ఎవరికీ దొరకకుండా దాక్కున్నానని, ఆ భయం వల్లనే బాలీవుడ్‌లో స్టార్ అయ్యే గోల్డెన్ ఛాన్స్‌ను కోల్పోయి పెద్ద మూల్యం చెల్లించుకున్నానని సాక్షి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది కూడా.
also read :38 ఏళ్లకే గుండెపోటుతో పాపులర్ సింగర్ మృతి.. షాక్‌లో సోషల్ మీడియా!

అయితే బాలీవుడ్ ని దూరం పెట్టేసిన సాక్షి సౌత్‌లో 2002లో వచ్చిన ‘సింహరాశి’తో పాటు మరికొన్ని చిత్రాల్లో కనిపించడం విశేషం. అలా అడపాదడపా కనిపించినప్పటికీ మానసికంగా సినిమా రంగానికి దూరమవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. చివరగా 2014లో ఒక కన్నడ చిత్రంలో మెరిసిన తర్వాత ఆమె వెండితెరకు పూర్తిగా గుడ్‌బై చెప్పారు.

చెల్లిపై సాక్షి హత్యాయత్నం?

ఇలా ఈ అండర్‌వరల్డ్ భయం ఒకవైపు సాక్షి కెరీర్‌ను ముంచేస్తే, మరోవైపు ఆమె సోదరి శిల్పా ఆనంద్ జీవితంలో నమ్మకద్రోహం, ఆస్తి వివాదాలు తెరపైకి వచ్చాయి. 2007లో స్టార్ ప్లస్ లవ్లీ మెడికల్ డ్రామా సిరీస్ ‘దిల్ మిల్ గయే’ ద్వారా కరణ్ సింగ్ గ్రోవర్‌తో క్రేజీ కెమిస్ట్రీ పండించి యువత మనసులు దోచుకున్న శిల్పా ఆనంద్, ‘మహిసాగర్’ సీరియల్‌తో పాటు 2006లో ‘ఇక్రార్ బై ఛాన్స్’, 2013లో ‘బ్లడీ ఇష్క్’ వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు.ఇక తెలుగులో మంచు విష్ణు సరసన విష్ణు సినిమాలో నటించిన సంగతి తెల్సిందే.

also read :బిగ్‌బాస్ 10లోకి హాట్ బ్యూటీ.. లీకైన కంటెస్టెంట్ల లిస్ట్.?
అయితే గత కొంతకాలంగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటున్న శిల్పా, తన సొంత సోదరి సాక్షి శివానంద్ అత్తగారైన భావన బ్రహ్మభట్ తమను చంపడానికి కుట్ర పన్నిందని సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.ఆ మహిళ తన భర్తను చంపి ఇన్సూరెన్స్ డబ్బు కాజేసిందని, తాము ఇండియాలో ఉన్నప్పుడు తమ పెంపుడు జంతువు షోపాను కూడా విషమిచ్చి చంపేసిందని శిల్పా పేర్కొన్నారు. ఈ విషయమై 2019 జూలై 18న పెట్టిన ఒక సుదీర్ఘ పోస్ట్‌లో, సదరు మహిళపై కేసు ఫైల్ కాగానే అమెరికాకు పారిపోయిందని, దమ్ముంటే ఇండియాకు వచ్చి పోలీసులను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.అయితే కారణాలు ఏవైనా ఆ తర్వాత కలిసిపోయిన సాక్షి, శిల్పా ప్రస్తుతం అన్యోన్యంగా జీవించడం ఇక్కడ విశేషం.

పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్న సాక్షి ఫ్యాన్స్

ఇక సాక్షి విషయానికి వస్తే గ్లామర్ ప్రపంచానికి దూరంగా పెళ్లి చేసుకుని ఒక ఇంటివారైన సాక్షి ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ పైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం లైమ్‌లైట్‌కు పూర్తిగా దూరంగా ముంబైలోనే తన భర్త, కుటుంబంతో ఉంటూ బిజినెస్ ఉమన్‌గా రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి ఈవెంట్లలోనూ ఆమె కనిపించడం లేదు. కనీసం అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా ఎక్స్ వంటి ఎలాంటి సోషల్ మీడియాల్లోఆమెకు అఫీషియల్ అకౌంట్స్ లేవు. అయితే ఆమె సోదరి, నటి శిల్పా ఆనంద్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారానే సాక్షికి సంబంధించిన అప్‌డేట్స్ అభిమానులకు అందుతున్నాయి. శిల్పా ఆనంద్ అప్పుడప్పుడు పంచుకునే ఫ్యామిలీ ఫోటోలలో సాక్షి శివానంద్‌ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లయినా ఆమెలోని గ్లామర్, ఆ అందమైన చిరునవ్వు ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ అదే క్లాసీ లుక్‌తో మెరిసిపోతోందని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు సాక్షి ఫ్యాన్స్.

also read :ఫ్యాన్స్‌కు షాక్.. ‘జాతిరత్నాలు 2’ కి ఆ ఒక్కటి మైనస్ అంటున్న నాగ్ అశ్విన్!

Related News

సినిమాకు ఐకాన్ హ్యూమన్ ఎమోషన్.. AI యుగంలో నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ క్రేజీ కామెంట్స్

హోటల్ రూమ్ ఖాళీ చేస్తూ విరుష్క ఏం వదిలి వెళ్లారంటే? బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్!

38 ఏళ్లకే గుండెపోటుతో పాపులర్ సింగర్ మృతి.. షాక్‌లో సోషల్ మీడియా!

మహేష్ బాబు సినిమాకు సీఎం చంద్రబాబు క్లాప్ కొట్టారని మీకు తెలుసా?.. ఏ మూవీకంటే?

ఆ డాక్యుమెంటరీ చూసి ఎమోషనల్ అయిన ధనుష్.. ‘ఎప్పటికీ నువ్వే GOAT’ అంటూ..’

ట్రోలింగ్‌పై జగపతి బాబు సీరియస్.. అందుకు తారక్ ఏడుస్తున్నట్లు క్రియేట్ చేసి..

పాపం అల్లరి నరేష్ హీరోయిన్‌కి ఎంత కష్టం వచ్చింది.. తన కుక్కను చంపేశారంటూ..

×