E-Paper
Advertisement

Bajaj Chetak C25: సింగిల్ ఛార్జ్‌లో 113km మైలేజీ.. తక్కువ ధరలో బజాజ్ ఎలెక్ట్రిక్ స్కూటర్

Bajaj Chetak C25: సింగిల్ ఛార్జ్‌లో 113km మైలేజీ.. తక్కువ ధరలో బజాజ్ ఎలెక్ట్రిక్ స్కూటర్
Advertisement

Bajaj Chetak C25| ద్విచక్ర వాహనాలలో బజాజ్ ఒక పాపులర్ బ్రాండ్. మంచి పికప్, మైలేజీ, త్వరిత సర్వీస్ కోసం బజాజ్ పెట్టింది పేరు. తాజాగా బజాజ్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ C25ని ఇండియాలో కేవలం రూ.91,399 (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేసింది. ఇది ప్రతిరోజూ సిటీలో ప్రయాణం చేసే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ద్విచక్ర ఎలెక్ట్రిక్ మోడల్ ఇది. రద్దీగా ఉండే రోడ్లపై సులభంగా, సౌకర్యవంతంగా తిరగడానికి ఇది చాలా బాగుంటుంది. కంఫర్టెబుల్ రైడ్, సులభంగా మలుపులు తిరగడం, దీర్ఘకాల మన్నిక ఇందులో ముఖ్య లక్షణాలు.

సిటీ రైడింగ్ కోసం పర్ఫెక్ట్ డిజైన్

చేతక్ C25 సిటీ ట్రాఫిక్‌లో చాలా సులభంగా తిరుగుతుంది. వేగంగా దిశ మార్చడం, దీంతో ఇరుకైన గ్యాప్‌ల ద్వారా సాఫీగా వెళ్లిపోవచ్చు. బాగా బ్రేక్ చేసిన రోడ్లపై కూడా స్థిరంగా ఉంటుంది. చిన్న సైజు వల్ల పార్కింగ్, చిన్న మలుపులు కూడా సులభంగా తీసుకోవచ్చు.

మోటార్ పర్‌ఫామెన్స్, టాప్ స్పీడ్

Advertisement

ఈ స్కూటర్‌లో రియర్ వీల్ హబ్ మోటార్ ఉంది. ఇది స్మూత్‌గా పవర్ ఇస్తుంది. పీక్ పవర్ 2.2kW ఉంటుంది. బజాజ్ ప్రకారం టాప్ స్పీడ్ 55 కి.మీ/గంట. సిటీలో చిన్నపాటీ దూరాని వెళ్లడం, రోజువారీ పనులకు చేతక్‌పై ఈ స్పీడ్ చాలా సరిపోతుంది.

బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్ వివరాలు

చేతక్ C25లో 2.5kWh NMC బ్యాటరీ ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంచారు. ఇలా ఉంచడం వల్ల బరువు తక్కువగా, బ్యాలెన్స్ బాగుంటుంది. ఒక్క ఛార్జ్‌తో 113 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని బజాజ్ చెబుతోంది. సిటీ రైడర్ల అవసరాలకు ఇది పూర్తిగా సరిపోతుంది. 0 నుంచి 80% ఛార్జ్ అయ్యేందుకు సుమారు 2 గంటలు పడుతుంది. ఫుల్ ఛార్జ్ 4 గంటల కంటే తక్కువలో అవుతుంది. 750W ఆఫ్-బోర్డ్ ఛార్జర్ ఉపయోగిస్తారు. ఇంట్లో, ఆఫీసులో సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

రైడ్ కంఫర్ట్, సస్పెన్షన్

Advertisement

ముందు వైపు ట్విన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఇది పాత సింగిల్ సస్పెన్షన్ కంటే బెటర్. ఫాస్ట్ టర్న్‌లు, బ్రేకింగ్ సమయంలో మంచి కంట్రోల్ ఇస్తుంది. బాగా బ్రేక్ చేసిన రోడ్లపై కూడా ధైర్యంగా రైడ్ చేయవచ్చు.

Also Read: నిజ జీవితంలో జేమ్స్ బాండ్ గాడ్జెట్స్.. ఈ టెక్నాలజీ మీకూ కావాలా?

సులభంగా హ్యాండిల్ చేయడం, రైడర్ ఫ్రెండ్లీ

స్కూటర్ బరువు కేవలం 107 కిలోలు మాత్రమే. సీటు ఎత్తు 763 మి.మీ. ట్రాఫిక్‌లో ఎవరైనా సులభంగా నడపగలరు. చేతక్‌పై ఇద్దరు సౌకర్యవంతంగా ప్రయణించాలన్నా.. 19% గ్రేడియంట్ ఎక్కగలదు. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది కాబట్టి ఏటవాలు మీద ఆగినప్పుడు వెనక్కి జరగదు. సేఫ్టీ ఇంకా ఎక్కువ అవుతుంది.

స్టోరేజ్, డిస్‌ప్లే, బిల్డ్ క్వాలిటీ

25 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఉంది. హెల్మెట్, రోజువారీ వస్తువులు సులభంగా పెట్టుకోవచ్చు. కలర్ LCD స్పీడోమీటర్ స్పష్టంగా సమాచారం ఇస్తుంది. 650 మి.మీ పూర్తి సీటు కంఫర్ట్‌గా ఉంటుంది. మెటల్ బాడీ బలంగా ఉంటుంది. IP67 రేటింగ్ ఉండడంతో ఈ వాహనం దుమ్ము, నీరు నుంచి ప్రొటెక్షన్ కలిగి ఉంది. వర్షంలో, కఠిన పరిస్థితుల్లో కూడా భయం లేదు.

బజాజ్ చేతక్ C25 చౌక ధర, మంచి పర్‌ఫామెన్స్, బలమైన నిర్మాణంతో బ్యాలెన్స్ కలిగిన స్కూటర్. సిటీలో ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. రేంజ్, కంఫర్ట్, డ్యూరబిలిటీతో సిటీ రైడింగ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉంది.

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×