E-Paper
Advertisement

Bajaj Chetak C25: మార్కెట్ లోకి బజాజ్ చేతక్ C25.. ఏథర్ రిజ్టా, TVS iQube, Ola S1 Xతో పోల్చితే బెస్టా? కాదా?

Bajaj Chetak C25: మార్కెట్ లోకి బజాజ్ చేతక్ C25.. ఏథర్ రిజ్టా, TVS iQube, Ola S1 Xతో పోల్చితే బెస్టా? కాదా?
Advertisement

భారతీయ వాహన తయారీ సంస్థ బజాజ్ ఇటీవల చేతక్ C25 ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్టులోకి దీనిని యాడ్ చేసింది. చేతక్ C2501 బజాజ్ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.  అయితే, భారతీయ మార్కెట్లో ఈ స్కూటర్ ఇతర కంపెనీ స్కూటర్లతో గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏథర్, TVS, Ola లాంటి కంపెనీలతో పోటీ పడనుంది. బజాజ్ చేతక్ C2501, ఏథర్ రిజ్టాS, TVS iQube, Ola S1 X మధ్య పోలికలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ, రేంజ్

బజాజ్ చేతక్ C2501 2.5 kWH బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 113 కి.మీ. పరిధిని ఇస్తుంది.  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 55 కి.మీ వేగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా, బజాజ్ చేతక్ C25 2 గంటల 25 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. 100 శాతానికి ఛార్జ్ చేయడానికి 3 గంటల 45 నిమిషాలు పడుతుంది.

Advertisement

ఓలా S1 X మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. 2 kWH, 3 Kwh, 4 kWH.  ఈ స్కూటర్ 108 కి.మీ నుంచి 242 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. 6 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 9 గంటలు పడుతుంది.

ఏథర్ రిజ్టా S మూడు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. 2.7 kWH, 2.9 kWH, 3.7 kWH. 159 కి.మీ వరకు రేంజ్ ను అందిస్తుంది.  ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాలు పడుతుంది.

Advertisement

TVS iQube 2.2 kWH, 3.1 Kwh, 3.5 kWH బ్యాటరీ ప్యాక్‌ లను కలిగి ఉంటుంది. 94 కి.మీ- 145 కి.మీ రేంజ్ ఇస్తుంది. 100 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల వరకు పడుతుంది.

ఫీచర్లు

బజాజ్ చేతక్ C2501 కలర్ LCD డిస్ప్లేతో సహా పలు ఫీచర్లను కలిగి ఉంది. హ్యాండిల్ బార్ కంట్రోల్స్ ద్వారా రివర్స్ మోడ్, కాల్ అలర్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో హిల్ హోల్డ్, గైడ్ మీ హోమ్ లైట్స్ లాంటి డైరెక్షన్స్ ఉన్నాయి.

Ola S1 X 4.3 అంగుళాల సెగ్మెంటెడ్ కలర్ LCD డిస్ప్లే, LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్‌లు, 34L బూట్ స్పేస్, సైడ్ స్టాండ్ అలర్ట్, ఎకో మోడ్, రివర్స్ మోడ్, OTA అప్‌డేట్‌లు, అడ్వాన్స్‌ డ్ రీజెన్, రిమోట్ బూట్ అన్‌ లాక్, బ్లూటూత్, GPS కనెక్టివిటీ, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

ఏథర్ రిజ్టా S కూడా పలు కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ అందించే 7-అంగుళాల LCD-డిస్ప్లే, కాల్స్, మ్యూజిక్ కోసం బ్లూటూత్, పార్క్‌ సేఫ్ హెచ్చరికలు, యాంటీ స్కిడ్ మోడ్, రైడ్ మోడ్‌లు, క్రాష్ హెచ్చరికలు, LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, 34L బూట్ స్పేస్ ఉన్నాయి.

TVS iQube 5 అంగుళాల TFT డిస్ప్లే, యాంటీ థెఫ్ట్ హెచ్చరికలు, క్రాష్ హెచ్చరికలు, టర్న్ బై టర్న్ నావిగేషన్,  రిమోట్ ఛార్జ్ స్థితి, అలెక్సా స్కిల్‌ సెట్, USB ఛార్జర్ పోర్ట్, 32L బూట్ స్పేస్ వంటి బహుళ లక్షణాలను కలిగి ఉంది.

ధరలు

బజాజ్ చేతక్ C2501 ధర రూ.91,399. ఓలా S1 X ధర రూ. 82,999,  ఏథర్ రిజ్టా S  ధర రూ. 1.04 లక్షలగా నిర్ణయించబడింది. ఈ నాలుగింటిలో TVS iQube అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 1.11 లక్షలు.

Read Also: కొత్త బ్యాటరీ, సరికొత్త రేంజ్.. సరికొత్త టాటా పంచ్ EV ఫేస్‌ లిఫ్ట్ వచ్చేసింది!

Related News

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

Big Stories

Advertisement
×