E-Paper
Advertisement

ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ.. ఈ 3 ఈవీ స్కూటర్లలో విన్నర్ ఎవరు?

ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ.. ఈ 3 ఈవీ స్కూటర్లలో విన్నర్ ఎవరు?
Advertisement

Electric Scooter Comparison: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. అందులో ముఖ్యంగా బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ రిజ్టా మోడళ్లు ఎక్కువ మంది కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ మూడు స్కూటర్లకు సంబంధించి ధర, రేంజ్, ఫీచర్లు, సౌకర్యం లాంటి అంశాలను ఒకసారి పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం..

ఏ స్కూటర్ ధర తక్కువ?  

ఈ మూడు స్కూటర్లలో బజాజ్ చేతక్ అత్యంత సరసమైన ధరతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.87,100. బడ్జెట్‌లో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ ధర సుమారు రూ.94,400. చేతక్ కంటే కొద్దిగా ఎక్కువ ధర ఉన్నా, అదనపు ఫీచర్లు అందిస్తుంది. ఏథర్ రిజ్టా ధర రూ.1.15 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు మోడళ్లలో ఇది ఖరీదైనదే అయినప్పటికీ, కుటుంబ వినియోగానికి అనువైన అనేక ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రేంజ్‌లో ఏది ముందుంది?

Advertisement

రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి రేంజ్ చాలా కీలకం. బజాజ్ చేతక్ వేరియంట్‌ను బట్టి 95 నుంచి 131 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ మోడల్‌ను బట్టి 100 నుంచి 140 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఏథర్ రిజ్టా ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 123 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ మూడు స్కూటర్లలో రేంజ్ పరంగా రిజ్టా ముందంజలో ఉంటుంది.

ఫీచర్లలో ఏది బెటర్?

బజాజ్ చేతక్ క్లాసిక్ డిజైన్‌తో పాటు బలమైన మెటల్ బాడీని కలిగి ఉంటుంది. రివర్స్ మోడ్, మంచి బిల్డ్ క్వాలిటీ దీని ప్రత్యేకతలు. రోజువారీ ఆఫీస్, సిటీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ లో స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఎక్కువగా ఉన్నాయి. టచ్‌ స్క్రీన్ డిస్‌ ప్లే, స్మార్ట్‌ ఎక్స్‌ కనెక్ట్, జియోఫెన్సింగ్, మొబైల్ యాప్ కనెక్టివిటీ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రైడింగ్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏథర్ రిజ్టాను ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. పెద్ద సీటు, ఎక్కువ అండర్‌ సీట్ స్టోరేజ్, ఫాస్ట్ ఛార్జింగ్, స్కిడ్ కంట్రోల్, ఆధునిక భద్రతా ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఏ స్కూటర్ ఎవరికి బెస్ట్?    

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉండి, నమ్మకమైన స్కూటర్ కావాలంటే బజాజ్ చేతక్ కొనుగోలు చెయ్యొచ్చు. మంచి రేంజ్‌తో పాటు టెక్నాలజీ ఫీచర్లు కావాలంటే టీవీఎస్ ఐక్యూబ్ ను ఎంచుకోవచ్చు. కుటుంబ అవసరాలు, ఎక్కువ స్టోరేజ్, ప్రీమియం ఫీచర్లు, ఎక్కువ రేంజ్ కోరుకునేవారికి ఏథర్ రిజ్టా అనుకూలంగా ఉంటుంది.బడ్జెట్, రోజువారీ ప్రయాణ అవసరాలను బట్టి సరైన మోడల్‌ను తీసుకోవడం మంచిది.

Read Also: 158 కి.మీ రేంజ్‌తో టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×