Ramayana: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా, కన్నడ స్టార్ హీరో యశ్ రావణాసురుడిగా రాబోతున్న ఈ చిత్రంలో.. రావణాసురుడి సోదరి శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్.. రావణుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ ఎంపికయ్యారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే విడుదల తేదీ అయితే ప్రకటించారు. కానీ ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు సైతం తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా.. ఇంకా ఎందుకు ఎటువంటి అప్డేట్స్ వదలడం లేదు అంటూ కామెంట్లు చేశారు. దీంతో మొన్నటికి మొన్న రణబీర్ కపూర్ పాత్రను పరిచయం చేస్తూ.. ఒక చిన్న గ్లింప్ విడుదల చేశారు. ఇటీవల ఒక ఈవెంట్ ను నిర్వహించి.. అందులో రామాయణ ట్రైలర్ విడుదల చేశారు. అయితే అధికారికంగా జూలై 24వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ కూడా భావించారు. అటు అభిమానులు కూడా ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆఖరి నిమిషంలో సడన్ గా ఈ ట్రైలర్ రిలీజ్ వాయిదా పడడంతో అభిమానులు , సినీ ప్రేక్షకులు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
also read:నన్ను మోసం చేశారు.. ఫస్ట్ రెమ్యూనరేషన్ పై విజయశాంతి కామెంట్!
అయితే ఇప్పుడు ట్రైలర్ వాయిదా వేయడానికి అసలు కారణాన్ని నమిత్ మల్హోత్రా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఒక సుదీర్ఘ నోట్ షేర్ చేస్తూ.. “రామాయణ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలన్నదే నా కల. ఇప్పుడు ఆ కల నిజమయింది. అయితే ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో విడుదల చేయడానికి సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామిగా చేరింది. ఈ భాగస్వామ్యంతో భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ చిత్రాల స్థాయిలో రామాయణం చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగానే ట్రైలర్ ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము” అంటూ నమిత్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
భారతీయ సంస్కృతి , పురాణాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశంగా రామాయణ నిలవబోతోంది. ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన అభిమానులు , మాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. 4000 కోట్ల భారీ బడ్జెట్లో రాబోతున్న ఈ సినిమాలో భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ స్థాయి విడుదల ప్రణాళికతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు సడన్గా ట్రైలర్ వాయిదా పడడంతో అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినా.. నమిత్ మల్హోత్ర ఇచ్చిన వివరణ చూసి అభిమానులలో మరింత ఆసక్తి నెలకొంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అన్ని భాషలలో విడుదల అయ్యే ఈ ట్రైలర్ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతుందో చూడాలి.
#Ramayana Trailer Postponed !! pic.twitter.com/mLLzsju5OV
— The Ramayana 🏹 (@RamayanaSaga) July 23, 2026