E-Paper
Advertisement

TVS RTX: యూత్ కు గుడ్ న్యూస్, క్రేజీ టీవీఎస్ అపాచీ వచ్చేస్తోంది!

TVS RTX: యూత్ కు గుడ్ న్యూస్, క్రేజీ టీవీఎస్ అపాచీ వచ్చేస్తోంది!
Advertisement

యువతను ఆకట్టుకునే బైక్స్ అందుబాటులోకి తీసుకురావడంలో టీవీఎస్ కంపెనీ ముందుంటుంది. మంచి స్టైల్, చక్కటి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ ఉండే బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే గత సంవత్సరం నవంబర్‌ లో మిలన్‌లో జరిగిన EICMA షోలో టీవీఎస్ స్పెషల్ లివరీలో అపాచీ ఆర్‌టిఎక్స్‌ ను ప్రదర్శించింది. ఇటీవల ఫ్రాన్స్‌ లోని లియాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదర్శించిన తర్వాత అదే ఆర్‌టిఎక్స్  ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ క్రేజీ బైక్ ను వీలైనంత త్వరగా ఇండియాలో విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీవీఎస్ కంపెనీ త్వరలోనే ఈ బైక్  డెలివరీలను ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది.

అపాచీ ఆర్‌టిఎక్స్ గురించి..

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ అనేది ఫ్రంట్ ఫెండర్, హెడ్‌ ల్యాంప్ కౌల్, ఫ్యూయెల్ ట్యాంక్ ఏరియా బ్లూ, రెడ్, వైట్ మిక్సింగ్ గ్రాఫిక్స్ తో అందంగా కనిపిస్తుంది. ట్రిపుల్ టోన్ పెయింట్ స్కీమ్ చెక్డ్ ఫ్లాగ్, ట్యాంక్ ఎక్స్‌ టెన్షన్లపై ‘300’ లెటర్స్ తో పాటు సీటు, వీల్స్, డిస్క్ కాలిపర్‌ పై రెడ్ కలర్ ఉంటుంది. అపాచీ ఆర్‌టిఎక్స్ ఇప్పటికే  రగ్గడ్ లుక్ తో పాటు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

అక్టోబర్ 2025లో డెలివరీలు

Advertisement

ఇండియన్ యూత్ ఈ బైక్ కోసం దాదాపు నాలుగు నెలల పాటు వెయిట్ చేయక తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మోటార్‌ సైకిల్ అక్టోబర్ 2025లో భారతదేశంలో లాంచ్ అయ్యింది. కొంతమంది లాంచ్ అయిన వెంటనే  బుక్ చేసుకున్నారు. అయితే, డెలివరీలకు సంబంధించి ఇప్పటి వరకు కంపెనీ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. ప్రస్తుతానికి ఈ బైక్‌కు డిమాండ్ చాలా ఉంది. అదే సమయంలో డిస్పాచ్‌లు చాలా నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అందుకే, బుక్ చేసుకున్న వారిందరికీ డెలివరీలు వచ్చేసరికి కనీసం 5 నుంచి 6 నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: హీరో డెస్టినీ 110 కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఎక్స్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 1.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 2.34 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఆన్ రోడ్ ధర వచ్చే సరికి మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంపెనీ అందించే మొత్తం ప్యాకేజీని పరిగణనలోకి తీసుకుంటే, ఇది ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ADV విభాగంలో అత్యంత విలువైన ఆఫర్‌లలో ఒకటి కానుంది.

Read Also: చాలా కాలంగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ను నడపడం లేదా? అయితే, కాస్త జాగ్రత్త!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×