Shahid Afridi On Ind Vs Eng: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇవాళ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ అలాగే టీమిండియా ( Team India vs England 2nd Semi-Final) తలపడతాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది ( shahid afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందని.. కచ్చితంగా ఇండియానే గెలుస్తుందని బాంబు పేల్చారు. నిన్ననే ముంబై వాంఖడే ( Wankhede Stadium, Mumbai) పిచ్ క్యూరేటర్ ను గంభీర్ ( Gautam Gambhir) బెదిరించాడని సంచలన ఆరోపణలు చేశారు. టీమిండియాకు అనుకూలంగా పిచ్ రెడీ చేశారని కూడా పేర్కొన్నాడు. ఈ లెక్కన ఇంగ్లాండ్ పై రెండవ సెమీ ఫైనల్ లో టీమిండియా గెలవడం గ్యారెంటీ అంటూ కారు కూతలు కూసాడు షాహిద్ ఆఫ్రీది.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది విషం కక్కాడు. మరోసారి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని బాంబు పేల్చాడు. పిచ్ క్యూరేటర్ ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెదిరించాడని… టీమిండియా కు అనుకూలంగా పిచ్ రెడీ చేయించాడని ఆరోపణలు చేశాడు షాహిద్ ఆఫ్రీది. గౌతమ్ గంభీర్ బెదిరించిన ఫోటోలు కూడా ఇప్పటికీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయని పేర్కొన్నాడు. దీన్నిబట్టి చూస్తే రెండో సెమీ ఫైనల్ లో ఫిక్సింగ్ జరిగిందని షాకింగ్ కామెంట్స్ చేశారు షాహిద్ ఆఫ్రీది. ఈ మ్యాచ్ పక్క ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది.. కాబట్టి ఇండియా ఫైనల్ కు వెళ్లడం గ్యారంటీ అన్నారు. దీంతో షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ పై మహమ్మద్ అమీర్ కూడా మరోసారి స్పందించారు. టీమిండియాపై ఖచ్చితంగా ఇంగ్లాండ్ గెలుస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లాండ్ ఫైనల్ కు వెళ్లడం గ్యారంటీ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా టీమిండియా ఓడిపోయి ఇంటిదారి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మహమ్మద్ అమీర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అంతకు ముందు సెమీస్ కు టీమిండియా రాబోదని వ్యాఖ్యానించిన మహమ్మద్ అమీర్.. ఇప్పుడు ఫైనల్ కు రాదని పేర్కొన్నాడు.
🚨 MASSIVE STATEMENT BY SHAHID AFRIDI ON INDIA 🚨
Shahid Afridi Said 🗣️
"India will win the semi-final because I saw some photos in which India's coach Gautam Gambhir is chatting with the pitch curator, which means there is something fishy and he is preparing the pitch in his… pic.twitter.com/mJX444j359
— Cricket Central (@CricketCentrl) March 5, 2026