E-Paper
Advertisement

Advices to Car Owner: ప్రతి కారు ఓనర్ ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఎందుకంటే?

Advices to Car Owner: ప్రతి కారు ఓనర్ ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఎందుకంటే?
Advertisement

ఈ రోజుల్లో చాలా మంది దగ్గర కారు ఉంటుంది. ఎక్కడికి వెళ్లాన్నా కారులోనే వెళ్తున్నారు. అయితే, కారు సేఫ్ గా ఉండాలన్నా, ప్రయాణం సాఫీగా జరగాలన్నా కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కారు ఓనర్లు తెలుసుకోవాల్సిన విషయాలు

⦿ ఇంజిన్ ఆయిల్‌: షెడ్యూల్ ప్రకారం ఇంజిన్ ఆయిల్ ను పరిశీలించాలి. ఆయిల్ ముదురు రంగులోకి మారితే వెంటనే మార్చాలి. టైమ్ ప్రకారం ఆయిల్ మార్చితే ఇంజిన్ సేఫ్ గా ఉంటుంది.

Advertisement

⦿ డ్యాష్‌ బోర్డ్ హెచ్చరికలు: డ్యాష్ బోర్డులోని వార్నింగ్ లైట్స్ గమనించాలి. దానిలోని హెచ్చరికలను వెంటనే సాల్వ్ చేయాలి.

⦿ ప్లూయిడ్స్ చెకింగ్: కారులోని కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్, వాషర్ ఫ్లూయిడ్, ట్రాన్స్ మిషన్ ఫ్లూయిడ్స్ ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. వేడి రేడియేటర్ క్యాప్‌ ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు.

Advertisement

⦿ బ్యాటరీ చెకింగ్: కారులోని బ్యాటరీని తరచుగా చెక్ చేయాలి. బ్యాటరీ చక్కగా ఉంటేనే ఇంజిన్ కు ఎలాంటి సమస్య రాదు.

⦿ కారు టైర్లను చెక్ చేయాలి: టైర్లను ఎప్పుడూ గమనించాలి. టైర్ గ్రిప్స్ అరిగిన వెంటనే వాటిని మార్చాలి. అదే సమయంలో  కారు టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయాలి.

⦿ కారు బ్రేక్‌ లను చెక్ చేయాలి: కారు బ్రేక్ వేసినప్పుడు ఏదైన శబ్దం వస్తే, వెంటనే సరిచేయించుకోవాలి. రెండేళ్లకు ఓసారి మాన్యువల్ లో చూపించినట్లుగా బ్రేక్ ఫ్లూయిడ్స్ ను మార్చాలి.

⦿ ఎయిర్ ఫిల్టర్ల చెకింగ్: ఎయిర్ ఫిల్టర్లు ఇంజిన్ తో పాటు ప్రయాణీకులను గాలిలో వచ్చే కాలుష్య కారకాల నుంచి కాపాడుతాయి. తరచుగా విటిని శుభ్రం చేయించాలి.

⦿ వీల్ అలైన్‌మెంట్,  బ్యాలెన్సింగ్:  సర్వీసింగ్ కు తీసుకెళ్లిన ప్రతిసారి వీల్ అలైన్ మెంట్, బ్యాలెన్సింగ్ ను చెక్ చేయించాలి.

Read Also: వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!

⦿కారు వైపర్ బ్లేడ్ల చెకింగ్: స్ట్రీకీ విండ్‌ షీల్డ్‌ లు బ్లేడ్ రీప్లేస్‌ మెంట్ టైమ్ ను సూచిస్తాయి. ప్రతి ఆరు నుంచి పన్నెండు నెలలకు ఓసారి వీటిన మార్చాలి.

⦿ కారు ఇంజిన్ వేడెక్కితే?: ఇంజిన్ వేడెక్కిన సమయంలో ఆఫ్ చేయాలి.  వేడి బయటకు వెళ్లేందుకు బానెట్ ఓపెన్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు రేడియేటర్ క్యాప్‌లను ఓపెన్ చేయకూడదు.

⦿ కారుకు అవసరమైన ఫ్యూయెల్: కారు ఇంజిన్ కు సరిపడిన ఇంధనాన్ని మాత్రమే వాడాలి. సిఫార్సు చేసిన ఆక్టేన్ రేటింగ్‌ ను ఫాలో కావాలి.

⦿ హెడ్‌ లైల్స్ పరిశీలన: హెడ్ లైట్స్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. విజుబులిటీ మసకగా కనిపించే వరకు డస్ట్ పేరుకుపోయేలా ఉండకుండా చూసుకోవాలి.

⦿ ఎమర్జెన్సీ కార కిట్: ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు. అందుకే అత్యవసర కిట్‌ ఉంచుకోవాలి. అందుతో జంపర్ కేబుల్స్, ఫ్లాష్‌ లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి ఉంచుకోవాలి.

Read Also: అడ్వెంచర్ To క్రూజర్.. డిసెంబర్ లో విడుదలయ్యే క్రేజీ బైక్స్ ఇవే!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×