E-Paper
Advertisement

Royal Enfield Bullet 650: వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!

Royal Enfield Bullet 650: వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!
Advertisement

Bullet 650 India Launch: భారత్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మంచి క్రేజ్ ఉంది. దేశ వ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అందుకు అనుగుణంగానే భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్స్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది కంపెనీ. అందులో భాగంగానే కొత్త బుల్లెట్ 650ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ ఏడాది లాంచ్ అయిన ఈ బైక్.. జనవరి 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోటార్ సైకిల్ మరింత అందుబాటులో ఉండే సాంప్రదాయ వెర్షన్ కానుంది.

చిన్న మోడల్స మాదిరిగానే..

చిన్న మోడళ్ల మాదిరిగా మర్కెట్లోకి అడుగు పెట్టబోతున్న బుల్లెట్ 650 .. రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్ లో క్లాసిక్ 650 కంటే తక్కువ రేంజ్ ను కలిగి ఉండబోతోంది. అయితే, ఇంజిన్ మాత్రం మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైక్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. బ్యాటిల్‌ షిప్ బ్లూ, కానన్ బ్లాక్, గోల్డెన్ పిన్‌ స్ట్రిప్స్, ట్రెడిషనల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్యాడ్జ్‌ తో రాబోతోంది. .

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ఇంజిన్ గురించి..

Advertisement

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ఇంజిన్ 648 సిసి కెపాసిటీతో రానుంది. ఎయిర్/ఆయిల్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది.  స్మూత్ పవర్ డెలివరీ. పవర్ ఫుల్ మిడ్ రేంజ్ పని తీరును కనబరుస్తుంది. ఈ మోటార్ దాదాపు 47 బిహెచ్‌పి, 52 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ ను జెనరేట్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ఫీచర్లు

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ఫ్యాక్టరీ ఫిటెడ్ యాక్సెసరీలను ఎక్కువ మొత్తంలో అందిస్తుంది. వీటిలో ఇంజిన్ గార్డ్, ఫాగ్ ల్యాంప్స్, సమ్ప్ గార్డ్, సాఫ్ట్ లగేజ్ సాడిల్ బ్యాగ్స్, టూరింగ్ సీట్, పిలియన్ బ్యాక్‌ రెస్ట్ ఉన్నాయి. ఇవి కొనుగోలుదారులు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా బైక్‌ ను రెడీ చేసుకునే అవకాశం కల్పిస్తాయి.

Advertisement

Read Also: ట్రాన్సపరెంట్ జీప్ చూశారా భయ్యా.. ఇంజిన్‌తో సహా అన్నీ బయటకే కనిపిస్తాయ్!

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ధర ఎంత అంటే?

బుల్లెట్ ట్రెడిషనల్ క్లాసిక్ కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. 650 సిసి మోడల్‌ కు కూడా ఇదే ధర ఉంటుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 ధర రూ. 3.50 లక్షల నుంచి రూ. 3.60 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉండవచ్చు అనుకుంటున్నారు. త్వరలోనే కంపెనీ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది.

Read Also: షావోమీ స్మార్ట్ ఫోన్లే కాదండోయ్, అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×