E-Paper
Advertisement

Upcoming Bikes Dec 2025: అడ్వెంచర్ To క్రూజర్.. డిసెంబర్ లో విడుదలయ్యే క్రేజీ బైక్స్ ఇవే!

Upcoming Bikes Dec 2025:  అడ్వెంచర్ To  క్రూజర్..  డిసెంబర్ లో విడుదలయ్యే క్రేజీ బైక్స్ ఇవే!
Advertisement

Upcoming Bikes 2025: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద టూవీలర్ మార్కెట్ గా కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ నెలలో సరికొత్త బైక్ లు విడుదల కాబోతోంది. యువకులను అద్భుతంగా ఆకట్టుకునే క్రేజీ బైక్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. డిసెంబర్ 19-20న జరిగే ఇండియా బైక్ వీక్ 2025లో ఆయా కంపెనీలు చాలా మోడల్స్ ను ప్రకటించనున్నాయి. వీటిలో పలు అడ్వెంచర్, నేకెడ్, క్రూజర్ సెగ్మెంట్స్ ను కవర్ చేయనున్నాయి. ఇవి డిసెంబర్ లో లాంచ్ కానుండగా, డెలివరీలు 2026లో ప్రారంభం కానున్నాయి. ఇంతకీ డిసెంబర్ 2025లో ప్రారంభం అయ్యే బైక్స్ ఏవి? వాటి ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి? ధర ఎంత ఉంటుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్ 2025లోవిడుదలయ్యే బైక్‌లు

 

⦿ Harley-Davidson X440 T

Advertisement

ఈ బైక్ డిసెంబర్ 6 లేదంటే 7న విడుదల కానుంది. దీని ధర రూ.2.8 – 3.0 లక్షల వరకు ఉంటుంది. క్రూజర్ స్టైల్ బైక్ 440cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. X440 పొజిషన్, కొత్త సీట్, టెయిల్ డిజైన్ తో వస్తుంది.  డెలివరీలు ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

⦿ BMW F 450 GS

ఈ బైక్ డిసెంబర్ 19న లేదంటే 20న విడుదల కానుంది. దీని ధర రూ.4.0 – 4.5 లక్షలు ఉంటుంది. ఈ అడ్వెంచరస్ బైక్ 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. TVSతో కలిపి ఈ బైక్ ను తయారు చేస్తుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. డెలివరీలు 2026న ప్రారంభం అవుతాయి.

⦿ Brixton Crossfire 500 Storr

Advertisement

డిసెంబర్ 19 లేదంటే 20న విడుదల అవుతుంది. ధర రూ.3.5 – 4.0 లక్షలు ఉంటుంది. ఈ అడ్వెంచర్, స్క్రాంబ్లర్ బైక్ 500cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. హస్క్వర్నా, ఇన్‌ స్పైర్డ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. మల్టీ పర్పస్ రైడింగ్ అవకాశాన్ని కలిగి ఉంటుంది.

⦿ FB Mondial Piega 452

ఈ బైక్ డిసెంబర్ 19న లేదంటే 20న విడుదల అవుతుంది. దీని ధర రూ.3.5 – 4.0 లక్షలు ఉంటుంది. ఈ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ 452cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. Aprilia Tuono 457కి పోటీగా రాబోతోంది. MotoHaus డిస్ట్రిబ్యూటర్ గా ఉంటుంది.

⦿ Bajaj Pulsar 125 (న్యూ మోడల్)

ఈ బైక్ కూడా డిసెంబర్ లో విడుదల అవుతుంది. దీని ధర రూ.0.8 – 1.0 లక్షలు ఉంటుంది. ఈ బైక్ 125cc ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మెరుగైన ఫీచర్స్, ఎఫిషియెంట్ మైలేజ్ తో అందుబాటులోకి రానుంది.

Read Also: హ్యార్లీ డేవిడ్సన్ నుంచి సరికొత్త బైక్, క్లాసిక్ రెట్రో లుక్‌ తో పిచ్చెక్కిస్తోందిగా!

⦿ Harley-Davidson CVO Road Glide

డిసెంబర్ చివరి వారంలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ. 35+ లక్షలు ఉంటుంది. ఈ ప్రీమియం టూరింగ్ బైక్, హై ఎండ్ సెగ్మెంట్ లో అడ్వాన్స్‌డ్  ఫీచర్స్ ను కలిగి ఉంటుంది.

Read Also:  వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×