E-Paper
Advertisement

Eesha Movie: ‘ఈషా’ ఒక రియలెస్టిక్ ఫీల్ ఇస్తుంది, ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు..నిర్మాత కామెంట్స్‌

Eesha Movie: ‘ఈషా’ ఒక రియలెస్టిక్ ఫీల్ ఇస్తుంది, ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు..నిర్మాత కామెంట్స్‌
Advertisement

Eesha Movie Producer Comments: గతంలో జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్‌ మన్నె. ఆ తర్వాత లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకం నుంచి వస్తున్న హారర్‌ చిత్రం ‘ఈషా’. రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌‌ కల్ట్‌ హిట్‌ సినిమాలను ప్రేక్షకులకు అందించిన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లాంగ్ గ్యాప్ తర్వాత..

డిసెంబరు 12న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దం అవుతుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా మూవీ నిర్మాత కేఎల్‌ దామోదర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను పంచుకున్నారు. నా గత చిత్రం ఫాదర్‌ చి్టి ఉమా కార్తీక్‌ చిత్రం తర్వాత నిర్మాతగా కొంత గ్యాప్‌ తీసుకున్నాను. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. దీంతో మంచి కథల కోసం చూస్తున్న నాకు అదే సమయంలో డైరెక్టర్ శ్రీనివాస్ మన్నె నేను ఒక సబ్జెక్ట్ ఫైనలైజ్ చేసుకుని దాని మీద వర్కవుట్ చేశాం. ఒక మిడిల్ రేంజ్ హీరో కోసం ప్రయత్నించాం.

దర్శకుడిపై గట్టి నమ్మకం..

Advertisement

ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. అదే టైమ్ లో శ్రీనివాస్ మన్నె ‘ఈషా’ కథ గురించి చెప్పారు. ఈ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ ప్రాజెక్ట్ చేశాను. ‘ఈషా’ సినిమాకు సంబంధించిన ప్రతీది శ్రీనివాస్ మన్నె చూసుకున్నారు. ఆయన ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. పైగా సినిమా అంటే ప్యాషన్ ఉన్న డైరెక్టర్ చాలా కష్టపడతాడు. తనకి తగినంత పేరు రాలేదని నా నమ్మకం. ఇండస్ట్రీలో కష్టపడి, ప్యాషన్ ఉన్న దర్శకులంతా ఫేమ్ కాలేరు. ‘ఈషా’ సినిమాను శ్రీనివాస్ బాగా తెరకెక్కించాడు. నేను ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ టైమ్ లో రెండు మూడు సార్లు చూశాను. చాలా బాగుంది. ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందనే నమ్మకం కలిగింది. మనం ప్రతి హారర్ థ్రిల్లర్ మూవీస్ లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాం. ‘ఈషా’ సినిమాలోనూ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది.

రెండు పాటలు అద్భుతం..

అయితే సినిమా చివరకు వచ్చేసరికి ఒక పర్సనల్ ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక రియలిస్టిక్ ఫీల్ తో బయటకు వస్తారు. హారర్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు విజువల్స్, సౌండింగ్ క్వాలిటీ బాగుండాలి. ఈ సినిమాలో ఆ రెండూ బాగా కుదిరాయి. పాటలు కూడా బాగా వచ్చాయి. శ్రేయా ఘోషల్, శంకర్ మహదేవన్ పాడిన ఈ రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ఈ సాంగ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని కావాలనే ఉండి శంకర్ మహదేవన్, శ్రేయా ఘోషల్ లాంటి స్టార్‌ సింగర్స్‌ ఈ రెండు పాటలు పాడించాను పాడించాను” అని ఆయన చెప్పుకొచ్చారు. ఆనంతరం తాను ఈ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం కొద్ది రోజుల దాకా ఎవరికీ తెలియదు. ఎందుకంటే డైరెక్టర్‌ శ్రీనివాస్ మన్నె విజన్ పై నమ్మకం కొన్ని రోజుల వరకు తాను సెట్‌పైకి వెళ్లలేదన్నారు. లాక్ డౌన్ తర్వాత సినిమా వ్యాపారంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తే గానీ సక్సెస్ రావడం లేదని ఆయన పేర్కొన్నారు.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×