E-Paper
Advertisement

EV Battery: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?

EV Battery: ఎలక్ట్రిక్ వెహికిల్ లో వెళ్తున్నారా? బ్యాటరీ అయిపోయే ముందు ఏం జరుగుతుందో తెలుసా?
Advertisement

కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. చాలా మంది పొల్యూషన్ లేని ప్రయాణాల కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఛార్జింగ్ అయిపోవడం. కొన్నిసార్లు సరిగా గమనించకపోవడం వల్ల ప్రయాణంలో మార్గం మధ్యలో కార్లు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే, EVలలో బ్యాటరీ అయిపోయే ముందు రెండు రకాల హెచ్చరికలు వస్తాయి. ఇంతకీ అవేంటి? వాటిని ఎలా హ్యాండిల్ చేయాలంటే..

బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయడం అనేది మంచిది కాదు. అలా చేయడం వల్ల బ్యాటరీ పని తీరును త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.  బ్యాటరీ 12 శాతం వరకు ఛార్జింగ్ ఉండగానే మళ్లీ ఛార్జ్ చేయడం మంచిది. 0% నుంచి EVని రీఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, బ్యాటరీ 15% నుంచి 20% కంటే తక్కువగా పడిపోనివ్వకూడదు.

బ్యాటరీ ఛార్జింగ్ జీరోకు చేరితే ఏమవుతుంది?  

Advertisement

వాస్తవానికి ఛార్జింగ్ శాతాన్ని డాష్‌ బోర్డ్‌ లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. బ్యాటరీ 10% సామర్థ్యాన్ని చేరుకున్నప్పుడు, ఛార్జ్ గేజ్ ఎరుపు రంగులోకి మారుతుంది. M-సైజు వాహనాలకు ఇది దాదాపు 10 మైళ్ల ఛార్జింగ్ మిగిలి ఉన్నప్పుడు జరుగుతుంది.  L-సైజు వాహనాలకు 13 మైళ్ల ఛార్జింగ్ మిగిలి ఉన్నప్పుడు జరుగుతుంది.

టార్టాయస్ మోడ్

ఛార్జింగ్ మరింత తగ్గిన నేపథ్యంలో టార్టాయస్ మోడ్ ఆన్ అవుతుంది. ఈ వార్నింగ్ వెహికిల్ ను అకస్మాత్తుగా ఆగిపోకుండా కాపాడేందుకు సాయపడుతుంది.  టార్టాయస్ మోడ్ అనేది వెహికిల్ వేగాన్ని తగ్గిస్తుంది. బ్యాటరీ అవుట్‌ పుట్‌ ను పరిమితం చేస్తుంది. డ్రైవర్ సురక్షితంగా సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌కు నెమ్మదిగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది. సాధారణంగా ఈ మోడ్ బ్యాటరీ ఛార్జ్‌ 10 శాతం నుంచి 1 శాతం వరకు ఉన్నప్పుడు ఆన్ అవుతుంది. 10 శాతం కంటే తక్కువగా ఛార్జింగ్ పడిపోయినప్పుడు, టార్టాయస్ సిగ్నల్ వెలుగుతుంది. ఆ తర్వాత కొద్ది దూరం వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూట్ వంపు తిరిగి ఉండటం, ఏటవాలుగా కొండలను ఎక్కాల్సి వచ్చినా, టార్టాయస్ మోడ్ లో ఎక్కడం అనేది సాధ్యం కాదు.

Advertisement

Read Also: టెస్లా మోడల్ Yపై అదిరిపోయే డిస్కౌంట్.. ఎన్ని లక్షలో తెలుసా?

ఛార్జింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బ్యాటరీ ఛార్జింగ్ సమస్య రాకుండా ఉండాలంటే.. క్రమం తప్పకుండా పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలి.  పెద్ద వెహికిల్స్ ఉంటే రేంజ్ ను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో పోర్టబుల్ ఛార్జర్‌ను తీసుకెళ్లడం మంచిది. లేదంటే, రహదారుల వెంట ఉండే ఛార్జింగ్ స్టేషన్లను ఉపయోగించుకోవడం మంచిది. చాలా దూరం వరకు ఛార్జింగ్ స్టేషన్లు లేవని భావిస్తే, ముందుగానే ఛార్జ్ చేసుకోవడం మంచిది. పూర్తిగా ఛార్జింగ్ అయిపోయిన తర్వాత బాధ పడటం కంటే, ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు.

Read Also: విన్ ఫాస్ట్ నుంచి 3 కొత్త కార్లు, ఇంతకీ వాటి ప్రత్యేకత ఏటంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×