E-Paper
Advertisement

Best Cars For City Traffic: రూ. 10 లక్షల్లోపు అదిరిపోయే కార్లు.. సిటీ ట్రాఫిక్ లో జర్నీకి ఇవే బెస్ట్!

Best Cars For City Traffic: రూ. 10 లక్షల్లోపు అదిరిపోయే కార్లు.. సిటీ ట్రాఫిక్ లో జర్నీకి ఇవే బెస్ట్!
Advertisement

నగరాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది సిటీ ప్రయాణాల కోసం ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు కూడా సిటీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే కారు కొనాలనుకుంటున్నారా? అయితే, రూ. 10 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ రోజువారీ సిటీ డ్రైవింగ్ కోసం  కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది. మంచి ఫ్యూయెల్ ఎఫిషియెన్సీని కలిగి ఉంటుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. వాగన్ R కారు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్‌తో జత చేయబడిన 1.2-లీటర్ అడ్వాన్స్‌డ్ K-సిరీస్ డ్యూయల్ జెట్ VVT ఇంజిన్‌ తో పని చేస్తుంది. ఇది S-CNG ఆప్షన్, AGS ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ లభిస్తుంది. భారీ ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా ఈ కారు మంచి మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధరలు రూ. 4.98 లక్షల నుంచి రూ. 5.88 లక్షల వరకు ఉంటుంది.

⦿ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

Advertisement

మీరు హయ్యర్ డ్రైవింగ్ పొజిషన్, SUV లాంటి  పని తీరును ఇష్టపడితే, టాటా పంచ్ ఫేస్‌ లిఫ్ట్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇది CNG ఆప్షన్‌ తో పాటు 5 స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌తో జత చేయబడిన 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.  హెడ్ అప్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ESP, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

⦿ MG కామెట్ EV

MG కామెట్ EV ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న అతి చిన్న EV. ఇది పట్టణ డ్రైవింగ్‌కు అనువైనదిగా ఉంటుంది. దీని కాంపాక్ట్ సైజ్ ట్రాఫిక్ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. పంచ్ డ్రైవ్ మోడ్‌లు, ఐడిల్ స్టార్ట్ స్టాప్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ లాంటి సిటీ ఫ్రెండ్లీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది BNCAP 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లతో వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో జత చేయబడిన CNG ఇంజిన్ మంచి మైలేజీని అందిస్తుంది.  దీని ధర రూ. 7.49 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది.

⦿ మారుతి సుజుకి బాలెనో

Advertisement

బాలెనో ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ నగర డ్రైవింగ్ అనుకూలంగా ఉంటుంది. దీని పవర్‌ ట్రెయిన్ 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ VVT ఇంజిన్, S-CNG టెక్నాలజీతో లభిస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AGS ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ను కలిగి ఉంటాయి. ఇది మైలేజ్, డ్రైవింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది.  హెడ్ అప్ డిస్ ప్లే ఉంటుంది. 360 డిగ్రీ కెమెరా, ESP, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు. దీని ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది.

⦿ హోండా అమేజ్

సిటీ ప్రయాణాలకు అనుకూలమైన కార్లలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కూడా ఉంటుంది. ఇది 1.2-లీటర్ i-VTEC ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో జత చేయబడి ఉంటుంది.   ఇది లీటరుకు 19 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ధరలు రూ. 7.47 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.

Read Also: టెస్లా మోడల్ Y కొనసాలనుకుంటున్నారా? అయితే, రూ. 3.5 లక్షల ఆఫర్ మీ కోసమే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×