E-Paper
Advertisement

Tesla Model Y Car: టెస్లా మోడల్ Y కొనసాలనుకుంటున్నారా? అయితే, రూ. 3.5 లక్షల ఆఫర్ మీ కోసమే!

Tesla Model Y Car: టెస్లా మోడల్ Y కొనసాలనుకుంటున్నారా? అయితే, రూ. 3.5 లక్షల ఆఫర్ మీ కోసమే!
Advertisement

దేశంలోని అతి పెద్ద యూజ్డ్ కార్ ప్లాట్‌ ఫామ్‌లలో ఒకటైన స్పిన్నీ టెస్లాతో చేతులు కలిపింది. తన వెబ్‌ సైట్ ద్వారా మోడల్ Y  కార్ల మీద ఏకంగా రూ. 25,000 వరకు బోనస్‌ను అందిస్తోంది. దేశం అంతటా మోడల్ Yపై టెస్లా ఇటీవల ప్రకటించిన రూ. 3 లక్షల ఎక్స్ఛేంజ్ ప్రోత్సాహక పథకానికి అదనంగా ఈ బోనస్ ను ప్రకటించింది. అయితే, మార్చి 31, 2026 నాటికి చేసిన చేసే డెలివరీలకు మాత్రమే ఎక్స్ఛేంజ్ బోనస్ ను అందించనున్నట్లు ప్రకటిచింది.

టెస్లా మోడల్ Y స్పెసిఫికేషన్లు, ఫీచర్లు  

టెస్లా మోడల్ Y  అద్భుతమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. క్రాస్ ఓవర్ SUV డిజైన్‌ తో ఆకట్టుకుంటుంది. ఇది మినిమలిస్ట్ ఫ్రంట్ ఫేస్,  వెడల్పు అయిన  LED లైట్ బార్, మృదువైన బాడీ లైన్‌ తో ఉంటుంది. ఇది స్టాండర్డ్‌ గా 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, మెరుగైన ఏరోడైనమిక్స్, క్లీన్ లుక్ కోసం  ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌ ను కలిగి ఉంటుంది.

పనితీరు, రేంజ్

Advertisement

మోడల్ Y మంచి పనితీరును కలిగి ఉంటుంది. బలమైన విద్యుత్ పని తీరును అందిస్తుంది. రియల్ వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ కేవలం 6 సెకెన్లలో 0–100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ RWD కొంచెం వేగంగా ఉంటుంది. ఇది బ్యాటరీ, వేరియంట్‌ను బట్టి ఒకే ఛార్జ్‌ పై దాదాపు 622–661 కిమీ వరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. ఇది తరచుగా ఛార్జింగ్ లేకుండా లాంగ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉంటుంది.

ఇంటీరియర్, టెక్నాలజీ

Y మోడల్ లో క్యాబిన్ ఇన్ఫోటైన్‌ మెంట్,  కంట్రోల్ కోసం 15.4 అంగుళాల సెంట్రల్ టచ్‌ స్క్రీన్, వెనుక ప్రయాణీకుల కోసం 8 అంగుళాల బ్యాక్ టచ్‌ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఉంటాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ లాంటి ఫీచర్లతో కంఫర్ట్, టెక్ ఎలివేట్ చేయబడ్డాయి.

Y మోడల్ భద్రతా ఫీచర్లు   

Advertisement

మోడల్ Y ఆటో పైలట్ లాంటి అధునాతన డ్రైవర్ అసిస్టెడ్ ఫీచర్లు ఉంటాయి. ఇందుకోసం మల్టీఫుల్ కెమెరాలు, సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది.  ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్(FSD) సాఫ్ట్‌ వేర్ ఆటోమేటెడ్ లేన్ మార్పులు, ఆటోపార్క్, సమన్ ఫంక్షన్లను కలిగి ఉంటుంది. అటానమస్ సాంకేతికతను కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ, సాఫ్ట్‌ వేర్

ఇతర టెస్లా మోడళ్ల మాదిరిగానే, మోడల్ Y ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్లను కలిగి ఉంటుంది. ఈ అప్ డేట్స్ నావిగేషన్, పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ సిస్టమ్ స్ట్రీమింగ్ యాప్‌లు, ఇన్ కార్ ఎంటర్‌ టైన్‌ మెంట్, వెహికిల్ కంట్రోల్స్,  ఛార్జింగ్ కంట్రోల్ కోసం స్మార్ట్‌ ఫోన్ ఇంటిగ్రేషన్‌కు సపోర్ట్ చేస్తుంది.

Y మోడల్ ధర  

మన దేశంలో టెస్లా మోడల్ Y రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర దాదాపు రూ.59.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. లాంగ్ రేంజ్ RWD వెర్షన్ ధర దాదాపు రూ. 67.89 లక్షలు ఉంటుంది. ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్  కోసం దాదాపు రూ. 6 లక్షలు అదనంగా ఖర్చవుతాయి. కస్టమ్ పెయింట్, ఇంటీరియర్ ఎంపికలు ధరను పెంచుతాయి. మొత్తంగా RWD ఆన్ రోడ్ ధర రూ. 61 లక్షలకు పైగా ఉంటుంది.

Read Also: 50 వేల కార్ల అమ్మకం.. రూ.50 వేల తగ్గింపు.. స్కోడా గుడ్ న్యూస్!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×