E-Paper
Advertisement

Cars Ruled In 90s: 90s దుమ్మురేపిన కార్లు, ఆ రోజుల్లో వీటికి ఉండే క్రేజే వేరు!

Cars Ruled In 90s: 90s దుమ్మురేపిన కార్లు, ఆ రోజుల్లో వీటికి ఉండే క్రేజే వేరు!
Advertisement

భారతలో 1990ల దశకం ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 1991 లిబరలైజేషన్ తర్వాత మారుతి సుజుకి ఆధిపత్యం కొనసాగింది. మారుతి సుజుకి కొత్త మోడల్స్ తో పాటు విదేశీ బ్రాండ్ల ఎంట్రీతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ దశకంలో బాగా పాపులర్ అయిన కొన్ని కార్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1990లలో టాప్ పాపులర్ కార్లు

 

⦿ Maruti 800

Advertisement

1983లో లాంచ్ అయినా 90లలో అత్యధిక సేల్స్ సాధించింది. మిడిల్ క్లాస్ పీపుల్స్ కార్ గా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సైజ్, మంచి మైలేజ్ (20+ kmpl), సరసమైన ధరతో బాగా పాపులర్ అయ్యింది. దేశంలో కార్ రివల్యూషన్ తెచ్చింది. మిలియన్ల కొద్దీ యూనిట్లు అమ్ముడయ్యాయి.

⦿ Hindustan Ambassador

1950 నుంచి అందుబాటులో ఉన్నా, 90లలో బాగా పాపులర్ అయ్యింది. టాక్సీలు, అధికారుల కారుగా పాపులర్ అయ్యింది. స్పేషియస్, బలమైన బిల్డ్, డ్యూరబుల్ ఫీచర్లు ఆకట్టుకున్నాయి. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ Premier Padmini (Fiat)

Advertisement

ముంబై కాలీ-పీలీ టాక్సీల ఐకాన్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది. 90లలో ఎక్కువగా కనిపించేది. కాంపాక్ట్, మంచి ఫ్యూయల్ ఎఫిషియెన్సీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. బాలీవుడ్ సినిమాల్లో బాగా కనిపించేది.

⦿ Maruti Zen

1993లో ఈ కారు లాంచ్ అయ్యింది. యూత్‌కు ఫేవరెట్, స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ గా గుర్తింపు తెచ్చుకుంది. పెప్పీ ఇంజన్, మంచి హ్యాండ్లింగ్, జెల్లీబీన్ డిజైన్ లాంటి ఫీచర్లతో బాగా ఫేమస్ అయ్యింది. మారుతి 800కు అప్‌గ్రేడ్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ Maruti Esteem

1994లో లాంచ్ అయ్యింది. కానీ, 90లలో బాగా పాపులర్ అయ్యింది. మిడ్ సైజ్ సెడాన్ గా అందుబాటులోకి వచ్చింది. స్పేషియస్, పవర్‌ ఫుల్ 1.3L ఇంజన్ ను కలిగి ఉంటుంద. ఫ్యామిలీ, బిజినెస్ పర్పస్‌కు పాపులర్.

⦿ Daewoo Cielo

1995లో లాంచ్ అయ్యింది. ప్రీమియం సెడాన్, ఎస్టీమ్‌కు కాంపిటీటర్ గా వచ్చింది. లగ్జరీ ఫీచర్లు, స్పేషియస్ ఇంటీరియర్ తో ఆకట్టుకుంది. కొత్త డిజైన్‌తో యూత్‌ను ఆకర్షించింది. 90లలో బాగా కనిపించేది.

⦿ Tata Sierra

ఈ కారు 1991లో లాంచ్ అయ్యింది. మొదటి ఇండిజినస్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. బాక్సీ డిజైన్, ఆఫ్ రోడ్ కెపాబిలిటీ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. టాటా మోటార్స్‌ కు మైలురాయిగా నిలిచింది.

Read Also: మోస్ట్ పాపులర్ ఇండియన్ మేడ్ వింటేజ్ కార్లు, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

⦿ Hindustan Contessa

1980ల నుంచి కానీ 90లలో లగ్జరీ మస్కులర్ కారుగా పాపులర్ అయ్యింది. పవర్‌ ఫుల్ ఇంజన్, ప్రెస్టీజ్ సింబల్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది. పొలిటీషియన్లు, ఎలైట్ క్లాస్ ఫేవరెట్ కారుగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇతర పాపులర్ కార్ల విషయానికి వస్తే, Maruti Gypsy (ఆర్మీ, ఆఫ్ రోడ్), Maruti Omni (ఫ్యామిలీ వాన్), Opel Astra (ప్రీమియం) లాంటి కార్లు కూడా అప్పట్లో బాగా కనిపించేవి.

Read Also:  ఐకానిక్ మోటార్ సైకిల్స్, ఇవి గ్యారేజీలో ఉంటే ఎంతో ఆ రేంజే వేరు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×