300 KM Range Electric Cars 2026: భారత్ లో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ రన్నింగ్ కాస్ట్, గ్రీన్ మొబిలిటీ లాంటి కారణాలతో చాలా మంది ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి చార్జ్ చేస్తే 300 కి.మీ, అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న చౌకైన 300 కి.మీ రేంజ్ ఈవీల గురించి తెలుసుకుందాం..
ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న కార్లలో టాటా పంచ్ ఈవీ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర సుమారు రూ.9.69 లక్షలు ఉంటుంది. వేరియంట్ ను బట్టి సుమారు 260 కి.మీ నుంచి 350 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. సిటీలో రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, లేటెస్ట్ ఫీచర్లు దీనికి ప్లస్ పాయింట్లు.
ఈ కారు కూడా మంచి ఆదరణ పొందింది. దీని ధర సుమారు రూ.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే 332 కి.మీ నుంచి 449 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఎక్కువ రేంజ్ కోరుకునే కుటుంబాలకు ఇది మంచి బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్న కారు టాటా టియాగో ఈవీ. దీని ప్రారంభ ధర సుమారు రూ.7.99 లక్షలు కావడంతో దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఈవీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారు 250 కి.మీ నుంచి 315 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది. చిన్న కుటుంబాలు, నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ కారు కూడా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. దీని ధర సుమారు రూ.18.02 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. వేరియంట్ ను బట్టి 390 కి.మీ నుంచి 510 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
ఇవే కాకుండా మార్కెట్లో మరికొన్ని 300 కి.మీ రేంజ్ ఈవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమ బడ్జెట్, అవసరాలు, ప్రయాణ దూరాన్ని బట్టి సరైన మోడల్ ను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఛార్జింగ్ స్టేషన్లు కూడా దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం మరింత ఈజీ అవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఈవీ మోడళ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: వామ్మో 100 కిలో మీటర్లా? 2026లో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ బైక్‌లు ఇవే!