E-Paper
Advertisement

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనేనా?.. అయితే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా దర్శకుడు ఆయనేనా?.. అయితే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే..
Advertisement

Mahesh Neel: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రస్తుతం ఆయన తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్‌తో బిజీగా ఉండటానికి సిద్ధమవుతుండగా, అప్పుడే ఆయన తర్వాత సినిమా గురించిన ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మహేష్ బాబు జతకట్టబోతున్నారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read also-అనన్యా పాండే ‘చాంద్ మేరా దిల్’ వివాదంపై సీరియస్ అవుతున్న నెటిజన్లు!

హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్..

Advertisement

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు మహేష్ బాబు డేట్స్‌ను కూడా బ్లాక్ చేశారని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ చెప్పిన ఒక పవర్‌ఫుల్ లైన్ మహేష్ బాబుకు బాగా నచ్చిందని, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ భారీ కాంబోపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

బాక్సాఫీస్ దగ్గర ‘మాస్ విధ్వంసం’ ఖాయం!

మహేష్ బాబు క్లాస్ అండ్ స్టైలిష్ లుక్.. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ కలిస్తే స్క్రీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే అభిమానులకు ఒళ్లు గగుర్పొడుస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ కాంబోపై భారీ ఎత్తున చర్చలు మొదలయ్యాయి. “మహేష్ బాబు అల్టిమేట్ స్క్రీన్ ప్రెజెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర ‘మాస్ విధ్వంసం’ ఖాయం” అంటూ నెటిజన్లు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Read also-Podarillu Today Episode : ప్రతాప్ కు షాకిచ్చిన చక్రీ.. పుట్టింటికి వెళ్లిన మహా.. సెంటిమెంట్ సీన్ తో హైలెట్..

అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు తన పూర్తి ఫోకస్‌ను “వారణాసి” సినిమాపైనే పెట్టనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులు ముగిసిన తర్వాతే ఈ డ్రీమ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, ఈ వార్త మాత్రం టాలీవుడ్‌లో సరికొత్త ఊపును తీసుకొచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×