E-Paper
Advertisement

Top Electric Scooter: పెట్రోల్ దొరకలేదా? వెంటనే ఈ EV బైకులు కొనేసుకోండి.. చీప్ అండ్ బెస్ట్ ఇవే!

Top Electric Scooter: పెట్రోల్ దొరకలేదా? వెంటనే ఈ EV బైకులు కొనేసుకోండి.. చీప్ అండ్ బెస్ట్ ఇవే!

Top EV Scooter Brands 2026: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రో ఉత్పత్తుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి చమురు నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు కొనసాగిస్తున్నవేళ పెట్రోల్ తో పాటు ఎల్పీజీ కొరత ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నారు. వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పెట్రో వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో అత్యంత చౌక ధరలో మంచి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టీవీఎస్, బజాజ్, ఏథర్, విడా, ఓలా కంపెనీలకు సంబంధించిన స్కూటర్లు టాప్ లో కొనసాగుతున్నాయి.

⦿ టీవీఎస్ ఐక్యూబ్

దేశంలో ఎక్కువగా అమ్ముడు అవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటి. మంచి బిల్డ్ క్వాలిటీ, చక్కటి పనితీరు,  అందుబాటులో సర్వీస్ నెట్‌ వర్క్ కారణం బాగా ఆదరణ దక్కించుకుంటుంది. ఐక్యూబ్ వేరియంట్లు సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ.1.60 లక్షల వరకు ధరను కలిగి ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 90 నుంచి 200 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. EMI ఆప్షన్లు, క్యాష్‌ బ్యాక్ లాంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

⦿ బజాజ్ చేతక్

బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్ గా కొనసాగుతోంది. ఇది రేట్రో డిజైన్‌ తో పాటు మెటల్ బాడీ, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆకట్టుకుంటుంది. దీని ధర రూ. 90,000 నుంచి రూ. 1.30 లక్షల వరకు ఉన్నాయి. రేంజ్ సుమారు 100–150 కి.మీ. వరకు ఉంటుంది. తక్కువ EMI, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

⦿ ఏథర్ ఎనర్జీ

ప్రస్తుతం ఉన్న బెస్ట్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏథర్ ఎనర్జీ ఒకటి. ఏథర్ 450, రిజ్టా మోడళ్లు టచ్‌ స్క్రీన్, నావిగేషన్, OTA అప్‌ డేట్స్ లాంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నాయి. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.60 లక్షల వరకు ఉన్నాయి. ఒకే ఛార్జ్ తో100 నుంచి 160 కి.మీ. వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రూ.20,000 వరకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. BaaS ఆప్షన్ తో ధర ఇంకా తగ్గుతుంది.

⦿ హీరో విడా

హీరో విడా స్కూటర్లు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. హీరో క్రెడిబులిటీ, సర్వీస్ నెట్‌ వర్క్ ఈ స్కూటర్లకు ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. విడా VX2, V2 మోడళ్లు రూ.75,000 నుంచి రూ.1.30 లక్షల మధ్య ఉంటాయి. ఇవి 140 కి.మీ. వరకు రేంజ్ ఇస్తాయి. తక్కువ EMI, జీరో ప్రాసెసింగ్ ఫీజు లాంటి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

⦿  ఓలా ఎలక్ట్రిక్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ రేంజ్, మంచి డిజైన్‌ తో ఆకట్టుకుంటున్నాయి. Ola S1 సిరీస్ రూ. 80,000 నుంచి రూ. 1.75 లక్షల వరకు ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 నుంచి 240 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుంది. డిస్కౌంట్లు, ఎక్స్టెండెడ్ వారంటీ లాంటి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

Read Also:కమర్షియల్ యూజ్ కు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్, ధర కూడా తక్కువే!

Related News

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

Big Stories

×