E-Paper
Advertisement

Without Licence EV Scooters: ఓలా To హీరో.. ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదండోయ్!

Without Licence EV Scooters:  ఓలా To హీరో.. ఈ స్కూటర్లకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదండోయ్!
Advertisement

దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో రాయితీలు అందించడంతో పాటు కొన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డ్రైవింగ్ చేసేందుకు లైసెన్స్ కూడా అవసరం లేదు. ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో ఉన్న బెస్ట్ వితౌట్ లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిలో పలు టాప్ బ్రాండ్లకు చెందిన మోడల్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూటర్లు తక్కువ దూరం, పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉండేలా రూపొందించారు.

దేశంలో టాప్ లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే

⦿ ఓలా గిగ్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సుమారు రూ. 39,999– రూ. 53,000 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 kW మోటారు ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 81–157 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

⦿ హీరో ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 59,000 పైగా ఉంటుంది. ఒకే ఛార్జ్ తో 120 కి.మీ ప్రయాణించే అవకాశం ఉంటుంది. దీనిలో USB ఛార్జింగ్, రివర్స్ మోడ్‌ ఉంటుంది.

⦿ యులు విన్: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 55,555పైగా ఉంటుంది. నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ స్పీడ్ కాస్త తక్కువగా ఉంటుంది.

Advertisement

⦿ కైనెటిక్ గ్రీన్ జింగ్: ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 90 కి.మీ పరిధి వరకు అందిస్తుంది. తక్కువ వేగం విభాగంలో అధిక శ్రేణికి ప్రసిద్ధి చెందింది.

⦿ ఒకినావా లైట్: ఈ స్కూటర్ ధర సుమారు రూ. 66,993 ఉంటుంది. దీనిలో 250W మోటార్ ఉంటుంది. 1.2 kWh రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 60 కి.మీ పరిధిని కలిగి ఉంది.

⦿ ఆంపియర్ రియో ​​80: ఈ స్కూటర్ ధర సుమారు రూ.43,000 నుంచి రూ. 53,000 వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్ తో 80 కి.మీ పరిధిని అందిస్తుంది. విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల కోసం ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది.

⦿ జాయ్ ఈ-బైక్: ఈ స్కూటర్ కూడా తక్కువ వేగం, లైసెన్స్ రహిత ప్రయాణాన్ని అందిస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.

Read Also:  టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!

లైసెన్స్ లేని ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు  

⦿ వేగం: వీటి వేగం నిబంధనలకు అనుగుణంగా పరిమితంగా ఉంటుంది.

⦿ రిజిస్ట్రేషన్: RTO రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

⦿ ఎవరికి అనుకూలం: విద్యార్థులు, వృద్ధులు, తక్కువ దూర ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది.

⦿ పరిధి: సాధారణంగా ఒకే ఛార్జ్ తో 50 కి.మీ నుంచి 120 కి.మీ వరకు ఉంటుంది.

⦿ భద్రత: చాలా మోడళ్లు మెరుగైన భద్రత, ఎక్కువ లైఫ్ కోసం LFP బ్యాటరీలను ఉపయోగిస్తాయి.

Read Also: ఫియట్ పద్మిని మళ్లీ వస్తుందా? అదీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×